ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ ఆఘా షహీద్ అలీ కాశ్మీరీ కవిత అనువాదాన్ని అందించారు. ఆ కవితను చదవండి.
మేము శరీరాన్ని
తగులపెట్టినప్పుడు
నీ ఎముకలు
కాలి బూడిద కావడానికి అంగీకరించలేదు
ఎవరూహించారు
మరణం లోనూ
నువ్వు
మొండి పట్టుదల గలవాడివని.
ఆంగ్లమూలం: ఆఘా షహీద్ అలీ
(ప్రసిద్ద కాశ్మీరీ-అమెరికన్ కవి)
తెలుగు: వారాల ఆనంద్