ఇరుగు పొరుగు కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ రెండు హిందీ కవితలను తెలుగులోకి అనువదించారు. వాటిని ఇక్కడ చదవండి
అంగీకారం
నువ్వు ఆలోచించిందల్లా సరైనదే
నేను ఆలోచించాలనుకోవడమే తప్పు
పీఠాల నుంచి నువ్వు నిర్వహించే సభలు సరైనవే
వెనుక బెంచీల్లోంచి ‘ఎందుకు’ అన్న ఆక్షేపణే తప్పు
నా వల్ల నీకు అసౌకర్యమన్నది నిజం
ఆటను పాడు చేసే బాధ్యతా రహితమయిన నా చర్య తప్పు
చీకటి రౌండ్ టేబుల్ లో నన్ను నిలబెట్టడం సరైందే
వెల్తురులో ముఖాలు చూడాలన్న నా విజ్ఞప్తి తప్పు
నాపై నువ్వు విధించిన శిక్ష సరైందే
మోసగించ బడుతున్నామన్న నా అభిప్రాయం తప్పు
మనుషుల పట్ల నీ ప్రవర్తన సరైందే
గోడకు సాగిలబడి నిలబడ్డ నా తీరే తప్పు
నా అభీష్టానికి అంగీకారం తెలుపకముందు వాళ్ళు రైటే
ఈ స్థితిలో కూడా నేను నవ్వాలనుకోవడం తప్పు
హిందీ: విష్ణు ఖరే
ఇంగ్లీష్: బాల్ ముకంద్ నంద్వాన
తెలుగు: వారాల ఆనంద్
--------------------------
వీడ్కోలు
నిర్ణయించడం ఒకింత కష్టమే
ఎవరు ఎవరికి వీడ్కోలు చెబుతున్నారో
ఇద్దరూ ఆకర్షణీయమయిన వారే
ఇద్దరూ ఆధునికులే
కానీ ఒకటే అంశం
సంప్రదాయక మయింది
అదేమిటంటే
ఇద్దరూ ఏడుస్తున్నారు
హిందీ మూలం: బద్రి నారాయణ్
ఇంగ్లీష్: మౌసమీ మజుందార్
తెలుగు: వారాల ఆనంద్