ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ ప్రబోధ్ ఎం. సంగ్మా కవితను తెలుగులో అందించారు. ఆ కవితను అక్కడ చదవండి.
మరణం తర్వాత
చుక్కల్ని చూస్తూనే ఉండగలనా
అందమయిన ఆకుపచ్చని
నా మాతృభూమిని చూడగలనా
నీలి ఆకాశాన్ని కప్పుకున్న
విశాల ప్రపంచాన్ని చూడగలనా
అంతటా ఆనందం పరుచుకున్నట్టని పిస్తున్నది
భూమి నిండా విస్తరించిన ఆకుపచ్చని గడ్డి .
గడ్డి అంచులపై స్థిర పడ్డ మంచు బిందువులు?
ఆకాశాన్ని అందుకునేంత ఎత్తులో
ఎగురుతున్న పక్షుల్ని చూడగలనా ?
దాగుడు మూతలాడుతున్న
మేఘాల్ని చంద్రుణ్ణీ చూడగలనా ?
జలపాత ధ్వనుల్ని వినగలనా ?
సంతోషంగా మోగుతున్న గంటల
మోతని వినగలనా?
మృత్యువు తర్వాత ఇక నేనేమీ
వినలేక పొతే
ఇక నా హృదయాన్ని కదిలించేది ఏదీ లేదు
ఒక వేళ
కోరికా ఆలోచనా ముగిసిపొతే
ఆత్మకు సంతోషం మృగ్యమే
భాష : ఏ చిక్
కవి - ప్రబోధ్ ఎం సంగ్మా
తెలుగు: వారాల ఆనంద్