నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనగామ నుండి పోతుల ఉమాదేవి రాసిన కవిత "ఆమె" ను ఇక్కడ చదవండి.
ఆమె నేర్వలేని విద్దె లేదు
చెయ్యలేని పని లేదు
ఆమె ప్రతి కదలిక ఒక అద్బుతo
ఆమె ఉపమానానికే ఉపమానo
ఆమె ఆనందంతో నవ్విన వేళ
ఇల్లంతా నక్షత్రచినుకులు రాలి వెన్నెల పారుతుంది
ఆమె నడచిన వేళ
పద్మపాదాలతో రాయoచల నడకలను తలపిస్తూ
హృదయవీణను పులకిoపజేస్తుoది
సహనాన్ని పోతపోసుకొని చదువుల ఒజ్జను తలపిస్తూ
బిడ్డలకై అహరహం శ్రమిస్తూ విద్యా వీచికవుతుoది
ఆమె ఆకలిని ఆలిoగనము చేసుకున్న దేహాలకు అన్నపూర్ణై కడుపులు నిoపుతూ
తృప్తిదేవతై మమకారపు ముద్దవుతుoది
ఆమె అన్యాయాన్ని ఎదిరించేవేళ
పరాక్రమాన్ని పరిపరివిధాల ప్రదర్శిస్తూ
ప్రచండ పిడుగవుతుoది
ఆమె ఓడిపోయేవేళ
ఓటమికి వెరవక తనువును అర్పిoచు
సమిధగానైనా.....