తెలుగును పరిరక్షించుకోవాలి

By Siva Kodati  |  First Published Feb 25, 2024, 6:38 PM IST

నేటి మధ్యాహ్నం హన్మకొండలోని బీఈడీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల్లో హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్   ఆచార్య బన్న ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆ సభ వివరాలు ఇక్కడ చదవండి


నేడు అనేక భాషలు ప్రపంచవ్యాప్తంగా  అంతరించిపోతున్నాయని, భాష అంతరిస్తే జాతి కూడా అంతరించినట్లేనని ఆచార్య బన్న ఐలయ్య  పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం హన్మకొండలోని బీఈడీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ మన మాతృ భాషను కాపాడుకోవలసిన బాధ్యత అందరి పైన ఉందని ఉదయ సాహితి లాంటి సంస్థలు మాతృభాష పరిరక్షణ కోసం పాటుపడాలని కోరారు.

ఉదయ సాహితీ వరంగల్ జిల్లా శాఖ అధ్యక్షురాలు వకుళవాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీలేఖ సాహితీ అధ్యక్షులు డాక్టర్ టి.శ్రీరంగస్వామి, తెలంగాణ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ బిల్ల మహేందర్, ఉదయ సాహితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దాస్యం లక్ష్మయ్య , సంస్థ గౌరవాధ్యక్షులు ఏడెల్లి రాములు, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు నగునూరి రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి కవితల పోటీ విజేతలకు అతిథులచే బహుమతుల ప్రధానం మరియు సన్మానం జరిగింది.

Latest Videos

వకుళాభరణం శివరంజని స్వాగత వచనాలచే ప్రారంభమైన ఈ సమావేశంలో మెరుగు అనూరాధ గారు సంస్థ కార్యవర్గాన్ని సభికులకు  పరిచయం చేశారు.

click me!