ఫిబ్రవరి 4న వర్తన ప్రారంభ సమావేశం.. సాహిత్యాభిమానులందరూ ఆహ్వానితులే..

Published : Jan 26, 2024, 07:28 AM IST
ఫిబ్రవరి 4న వర్తన ప్రారంభ సమావేశం..  సాహిత్యాభిమానులందరూ ఆహ్వానితులే..

సారాంశం

ఫిబ్రవరి 4వ తేదీన వర్తన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభ సమావేశం ఉంటుందని ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉదయం  10.30 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో ఉంటుందని పేర్కొన్నారు..

సాహిత్యరంగంలో నవీన ధోరణులు పాదు కొల్పాలన్న లక్ష్యంతో  వర్తన సాహిత్య సంస్థ ఏర్పాటు అయ్యిందని ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభ సమావేశం 04 ఫిబ్రవరి 2024 (ఆదివారం) ఉదయం 10.30 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో ' కవిత్వం - శిల్పం '  అనే అంశంపై ప్రముఖ విమర్శకులు ఎం. నారాయణ శర్మ ప్రసంగిస్తారని చెప్పారు. ఈ సమావేశానికి గుడిపాటి అధ్యక్షత వహిస్తారు. ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌ సమన్వయకర్త గా వ్యవహరిస్తారని తెలిపారు. కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు అందరూ ఆహ్వానితులే అని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం