గురిజాల రామశేషయ్య కవిత : స్పందనా రాహిత్య గీతం

Published : Aug 02, 2023, 12:20 PM IST
గురిజాల రామశేషయ్య కవిత :  స్పందనా రాహిత్య గీతం

సారాంశం

ఇంత ఎదిగీ ఓ మానవా ! నీకు ఉనికి పోరాటం ఎందుకో అంటూ గురిజాల రామశేషయ్య రాసిన కవిత ' స్పందనా రాహిత్య గీతం ' ఇక్కడ చదవండి :

తూరుపు రాగరంజిత
ఊరుపు పరిమళ సంచిక
మనసంటే ఊహాపోహలే
మనసుంటే మహనీయులే

కడచిన యుగాలెన్నైతేనేమి
వడికిన శాంతిసూత్రం తెగొద్దు
ఇంత ఎదిగీ ఓ మానవా !
నీకు ఉనికి పోరాటం ఎందుకో

దిక్కులన్నీ పోషిస్తే ఎదిగీ 
నీవు ఒక్కడివే మిగలాలనే
లో 'ఇష్టాలు ఏ సుఖాలకు తృప్తి పాట?
నీకు - రోబోట్ ప్రేయసి పరిష్వంగం - చాల్నా!?
ఇంతే సంగతులా

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం