నీలోని నీకు నీవే ఓ ప్రశ్నవైతే సరియైన సమాధానం దొరుకుతుంది తప్పక ! అంటూ గురిజాల రామశేషయ్య రాసిన కవిత ' లోకంలోని నీ లోకం ' ఇక్కడ చదవండి :
మనిషి అంటే మనసే !
జ్ఞాపకాలు -- మరపులు రెండూ
మనిషికి బలమైన శక్తులు !
పరస్పర వ్యతిరేకాలైనా
సత్యాసత్య జ్ఞాన సాపేక్షాలే
జీవితారోహణమే లక్షిత సోపాన శ్రేణి
జగతి : వస్తు-చైతన్య వాస్తవ రూపమే
ఉనికికి పరిణామమే
ఆధారం అభివృద్ధి ప్రగతి
పరస్పర సాపేక్ష సమంజస్యాలు
undefined
ప్రకృతిని సహజత్వాన్ని
ధ్వంసం చేయటం నేర్చి నేర్పి
సాధ్యమైందని సంబరపడకు !
విధ్వంసన : ప్రకృతి విరుద్ధమే
సమగ్ర జీవితానికి శాపమే !
ప్రకృతి పాంచభౌతిక విశాలం
దాని గమనం సమయ బలం బహుళం
తరచి చూస్తే జీవన ఫలిత నిబద్ధమే
సృష్టి పరిణాక్రమమంతా ---
తరచిచూడు
చక్రవర్తన (Cyclic)శైలి ఒకటి
సత్వర అనుభవం కోసం
ఆరాటపడుతూంటుంది
మానవాళికి వినియోగడాలని---
గమనించు బలంపుంజుకో
ఈ ఆరాట పోరాటాలు సరే !
జీవన సుందర శైలి నీదని మరువకు
ఒడుపు తెలిస్తే చెడుపు ఉండదు
నీలోని నీకు నీవే ఓ ప్రశ్నవైతే సరియైన
సమాధానం దొరుకుతుంది తప్పక !