గురిజాల రామశేషయ్య కవిత : సినీవాలి

By SumaBala Bukka  |  First Published May 11, 2023, 11:39 AM IST

సృష్టి అందమైన సృజన ! - మనిషే బుద్ధి పెరిగీ విధ్వంసశిల్పి ! అంటూ గురిజాల రామశేషయ్య రాసిన  కవిత  ' సినీవాలి ' ఇక్కడ చదవండి : 


నేనెటు చూసినా ఆనంద లాస్యమే - తాండవమే
వికారం అనబడే అంశాల్లోనూ నాకు 
సాకారమే సాక్షాత్కరిస్తున్నది మరి...
మౌలికతను పర్యాలోకిస్తే... -
సృష్టి అందమైన సృజన ! -
మనిషే బుద్ధి పెరిగీ విధ్వంసశిల్పి !

లోయల అందాలు శిఖరాల చందాలకు
పచ్చల కిరీటాలు సమలంకరించే
గూఢనిధులు
గుప్తతే మనుషుల ఆప్యాయత ఆప్తత

Latest Videos

మనోనేత్రం నిఘా నిఘరానీల్లో
హృదయ జ్యోత్స్న క్రమ ప్రవర్తిత పూర్ణిమ
పరిణామం ప్రకృతి స్వభావం  
పూర్ణిమానంతరం క్షీణత 
అయినా మనశ్చంద్రిక 
అమావాస్య రాత్రిలో  - సినీవాలి -
తదనంతరం అనుదిన ప్రవర్ధనశీలి
ఇదే ఇదే కాల సత్యం : మనస్సాక్ష్యం

click me!