గురిజాల రామశేషయ్య కవిత : గమనం- గమ్యం

Siva Kodati |  
Published : Jun 18, 2023, 03:03 PM ISTUpdated : Jun 18, 2023, 06:21 PM IST
గురిజాల రామశేషయ్య కవిత : గమనం- గమ్యం

సారాంశం

నిబ్బరంగా నిద్రపోయి సేదదీరే బతుకు తీరును ఆహ్వానిద్దాం కపట విషాలను విరిచేద్దాం అంటూ  గురిజాల రామశేషయ్య రాసిన కవిత ' గమనం- గమ్యం ' ఇక్కడ చదవండి :

మనం  మేల్కోవటమంటే
నిద్ర మరచి కండ్లుదెరవటమేనా !?
ఇంత పరిమితమా ? అయితే  - వింతే - !
కన్ను తెరవటం మనసు తెరవటం కాదా ?
కన్ను లోకాన్ని చూపిస్తుంది
సరే గాని మనసు మాటేమిటి ? 
అసలు మనసంటేమిటి ??

మనసు ఉండీ జీవితమై కాలం గడుపుతూ
మనుషులమై సంవత్సరాలను కొలుస్తాం

 కాలం -- 
ఋతువుల మార్పిడితో
మనకెన్నెన్నో అలజడులను దాట నేర్పుతుంది 
జీవితమూ ఇంతే -- కుంగి పోయే పొంగి పోయే పాఠ్య బోధనే !

అలలెన్నెన్నో తరలివస్తూ  తీరం తాకుతూ ఉంటే
ఏదో భావ జగత్తును పరిచయం చేసినట్టే
భూగోళం పై మన నివాసం

ఆవిరి ఏదో ఎగసిపోతల మాటు వేస్తుంటుంది
దేశదేశాల్లో  నేలమ్మకు వానలూ  
మనుషులకు  పంటలూ పండుగలూ వేడుకలూ
     *               *              *
కాలమే  మోతుబరి ‍ పెద్ద పెబ్బ
చీకటి వెలుగుల మార్పిళ్ల‌ బొబ్బ
నిద్ర పని తారాటల ఆటలో
ఎవరికి వారుగా ఉండలేనిదే సమాజం 
విజయం కోసం 
జనసముద్రాలను కల్లోల పరచవద్దు
       *          *         *
నిలకడగా ప్రశాంతంగా 
ముందుకు అడుగులు పడితేనే
జీవితం జీవించినట్లు 
సమాజం ఉజ్జీవించినట్లు
మనసుల్లో సునామీలు
రేగొద్దు  రేపొద్దు
ప్రవాహం సాఫీగా కొనసాగాలి

మమతల మతలబులు మరచిపోవద్దు
బతుకు అపహాస్యంపాలు కావద్దు
నిత్య చీకట్లను వెలిగించుకుందాం
చికాకులను ధిక్కరిద్దాం

ఉదయారుణ గగనాల పైకి రెక్కలు బారసాచి
సాహసయాత్రలు చేసి ఫలశాఖలపై 
పలుశాఖలపై వాలిపోదాం 
గూడు చేరి గుండెలపై చేయి వేసుకుని
నిబ్బరంగా నిద్రపోయి సేదదీరే 
బతుకు తీరును ఆహ్వానిద్దాం
కపట విషాలను విరిచేద్దాం 
కల్మషాలను శుభ్రభావనలతో కడిగేద్దాం
ఎండమావి నీ కాలి ధూళి
కలివిడి క్షేమాలు నీ అడుగుల సవ్వడులు 

ఆలోచన మనిషి గమనం 
ఆనందం మనసు గమ్యం

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం