మనోహర్ రెడ్డి గంటా మినీ కవితలు: ఘంటారావం

By telugu team  |  First Published Jul 20, 2020, 4:42 PM IST

మినీ కవితలకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గంటా మనోహర్ రెడ్డి ఘంటారావం పేరు మీద మినీ కవితలు రాశారు. వాటిని చదవండి.


చేసే పొరపాటు
చిన్నదనుకోకు
పోయేప్రాణం
పెద్దదని మరువకు

వేకువ విలువ తెలిసేది
చీకటిలోనే
స్వేచ్ఛ విలువ తెలిసేది
చెరసాలలోనే

Latest Videos

కాలం కరుణిస్తే
కీర్తి ఖాతాలో జమ
కాలం కోపిస్తే
కర్మ సిద్ధాంతం నమః 

అనుమానం ఆవహిస్తే
అన్యోన్యత ఆవిరే
ఆంధ్రభోజుడు అప్పాజీని
అంధుని చేసిన తీరే

అతివ ఏనాడైనా 
అబల కాదు సబలే
కురుసభలో ప్రశ్నించిన
పౌరుషాగ్ని పాంచాలే

కనబడకుంటే కారణాల ఆరాలు
కనబడుతుంటే కారాలు మిరియాలు
కలహాల కీలలలో
కాపురాల కర్పూరాలు

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

click me!