ఈ నెల 23 న జరిగిన సహృదయ కార్యవర్గ సమావేశంలో 2023 - 2024 సం. కొఱకు గన్నమరాజు గిరిజామనోహర బాబు అధ్యక్షులుగా సహృదయ నూతన కార్యావర్గం ఏర్పాటైంది.
ఈ నూతన కార్యావర్గంలో న్యాలకొండ భాస్కర రావు , డా . ఎన్ వి ఎన్ చారి, బోయినపల్లి పురుషొత్తమరావు ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శి కుందావజ్ఝల కృష్ణమూర్తి, సాహిత్య కార్యదర్శి మల్యాల మనోహర రావు, సాంస్కృతిక కార్యదర్శి వనం లక్ష్మీకాంతరావు, కోశాధికారి డా.ఎం. రాధాకృష్ణ ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులు : శ్రీ డి వి శేషాచార్య, శ్రీ కళా రాజేశ్వరరావు, డా. టి. లక్ష్మణరావు, శ్రీ మలినేని కృష్ణ, శ్రీ జె . నాగరాజు, శ్రీ ఎస్. వెంకటేశ్వర్లు. మార్గదర్శక మండలిలో ఎవి నరసింహారావు, డా. కెఎల్ వి ప్రసాద్ ఉంటారని సహృదయ నూతన అధ్యక్షులు గన్నమరాజు గిరిజామనోహర బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
సహృదయ సాహితి సంస్థ ఇటీవలే రజతోత్సం జరుపుకుంది. హన్మకొండ కేంద్రగా పని చేస్తున్న ఈ సంస్థ గత 25 సంవత్సరాలుగా పలు సాహితీ సమావేశాలు, నాటక ప్రదర్శనలు, పుస్తక ముద్రణలు, అవధాన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని కవి పండితులను వరంగల్ పట్టణవాసులకు పరిచయం చేస్తూ అక్కడి సాహితీ ప్రియుల దాహాన్ని తీరుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒద్దిరాజు సోదరుల స్మృత్యర్థం ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ గ్రంథానికి పురస్కారం ప్రదానం చేస్తుంది.
గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖకు అధికారిగా పనిచేసిన కీ.శే. డా. రాళ్ళబండి కవితా ప్రసాద్ ఈ సంస్థను ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సాహిత్య ప్రేమికులకు ఈ సంస్థ దీపస్తంభం లాంటిదని కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గతంలో అభిప్రాయపడ్డారు.