పరుశురాంరావు కవిత: "దుర్గుణాల విష పరిష్వంగం"

By Pratap Reddy Kasula  |  First Published Dec 3, 2021, 2:28 PM IST

జి.పరుశురాంరావు విశ్రాంత ఆంగ్ల లెక్చరర్, కరీంనగర్ వారి ఆంగ్ల కవిత Vicious Vices కు డా.టి.రాధాకృష్ణమాచార్యుల తెలుగు అనువాదం "దుర్గుణాల విష పరిష్వంగం" ను ఇక్కడ చదవండి.


దుర్గుణాల విష పరిష్వంగంలో 
చిక్కిన మనిషి తిరోగామేగా!       
దురాశ నిశాలో ధన వాంఛితుడు
ఎటులైనా కరువే నిద్ర 
మనిషికి చివరకు మిగిలేది దుఃఖమే  

మొహం వలలో ఆనందం దూరమవు దుర్గుణం 
అది రేపును ఆశల దాహం 
మనిషి వెర్రివాడవు వరకూ,  
ఆఖరికి మరణ మృదంగం మోగేదాకా

Latest Videos

ఆగ్రహం మరో దుర్గుణం
మనిషిని కాల్చి జీవితాన్ని కూల్చేను
అసహనం కోపానికి దారి 
అది శాశ్వత శత్రువులకు నాంది

అహం ప్రమాదకర దుర్గుణం విచ్చు కత్తిలా
మనిషి మనో వికాసాన్ని జడత్వంలో నెట్టు
వదనానికి  సంపూర్ణ స్వచ్ఛ డంభాలతో వాగేను 
నిర్మల నిజాయితీ పెద్దలనే అవమానించు

అసూయ మృత్యుకుహరం 
దారుణ దుర్గుణం
ఇతరులను  దహించే నిప్పుల కొలిమి 
మనిషి ఆరోగ్యాన్నీ నాశనం చేసి   
తన సహృదయతను విష తుల్యం చేయు క్రమంగా 

వివిధ దుర్గుణాలను గ్రహించి 
మనిషి దూరం పెట్టినప్పుడు
తన వ్యక్తిత్వం వికసించు 
ఎప్పటికీ ఆకుపచ్చగా బతుకు   
తెగులు పట్టని ఓ చెట్టు వోలే..

click me!