ఉద్వేగం కలిగించే కళ్లెం నవీన్ రెడ్డి "యోధ" కవిత్వం

By Siva Kodati  |  First Published Feb 7, 2024, 6:10 PM IST

చదివిన కొద్దీ ఉద్వేగాన్ని ఉత్సాహాన్ని కలిగించే  కవితా సంపుటి కళ్లెం నవీన్ రెడ్డి రచించిన "యోధ" అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఈ పుస్తకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి  అధ్యక్షులు  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న వారి స్వగృహంలో ఆవిష్కరించారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్  పోరాటాన్ని కళ్ళ ముందు ఉంచిన  "యోధ" కవితా సంపుటిని కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, సోమారంపేట్ గ్రామానికి చెందిన యువకవి కళ్లెం నవీన్ రెడ్డి రాశారు.  78 కవితలు ఉన్న ఈ కవితా సంపుటి  కెసిఆర్  ఆలోచనలకు అక్షర రూపం.

Latest Videos

undefined

ఈ పుస్తకానికి కేసిఆర్ గురువు  మృత్యుంజయ శర్మ ముందుమాట రాశారు. ఈ పుస్తక ఆవిష్కరణ తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు, కెసిఆర్ అభిమానులకు పండగ లాంటిదిఅని పూర్వ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి  అభిప్రాయపడ్డారు.  ఉద్యమాన్ని కేసీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్ళిన విధానాన్ని కవి కవిత్వంలో చెప్పిన విధానం పాఠకులను ఆకట్టుకుందని పూర్వ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రజలకోసం పడిన తపనను కవి చక్కగా వ్యక్తీకరించారు అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, గువ్వల బాలరాజు, బి ఆర్ ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

click me!