మాజీ ఐఎఎస్ అధికారి విజయ్ కుమార్ కు సహృదయానుబంధ పురస్కారం దక్కింది. అలాగే కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారం - 2022 పోటీలకు కవితా సంపుటాలకు నిర్వహకులు ఆహ్వానించారు.
సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్లు ఆధ్వర్యంలో ప్రతి ఏటా మే21న ప్రముఖ శతావధాని కీ.శే.డా.రాళ్ళబండి కవితా ప్రసాద్ జయంతి సందర్భంగా ఆయన ఆత్మీయ స్మరణలో ఐ ఏఎస్ / గ్రూప్ వన్ కేడర్ కవులకు సహృదయానుబంధ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఇందులో భాగంగా 2022 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖలో సంచాలకులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ప్రముఖ నాటక రచయిత, ప్రయోక్త దీర్ఘాసి విజయభాస్కర్ గారికి సహృదయానుబంధ పురస్కారం - 2022 ఇస్తున్నట్టు అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జి.గిరిజా మనోహరబాబు, డా.ఎన్.వి.ఎన్.చారి తెలిపారు.
ఇప్పటివరకూ ఈ పురస్కారం అందుకున్న ప్రముఖులు :
పి వి ఆర్ కె ప్రసాద్ , జె బాపురెడ్డి, ఎ. విదాసాగర్, పట్నం శేషాద్రి, ఎన్.ముక్తేశ్వర రావు, వాడ్రేవు చినవీరభద్రుడు.
త్వరలో హనుమకొండలో నిర్వహించే ప్రత్యక్ష కార్యక్రమంలో డా.దీర్ఘాసి విజయకుమార్ కు ఈ పురస్కారం అందించి సత్కరిస్తారు.
కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారం - 2022 పోటీలకు కవితా సంపుటాలకు ఆహ్వానం
ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్, కవిసమ్మేళనం సాహిత్యవేదిక వ్యవస్థాపకులు కొత్తపల్లి నరేంద్రబాబు స్మారకార్థం ప్రతిఏటా ఇచ్చే సాహిత్య పురస్కారానికి కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు ప్రముఖ కవి, నిర్వాహకులు కొత్తపల్లి సురేష్ తెలిపారు.
ఈ సాహిత్య పురస్కారానికి 2021 డిసెంబరు లోపు అచ్చైన పుస్తకాలను మాత్రమే మూడు ప్రతులను
కొత్తపల్లి సురేష్, ఇంటి నంబర్ : 33-129-1, OVR కాలనీ,
SRMT గోడౌన్ దగ్గర, కళ్యాణదుర్గం రోడ్, అనంతపురం - 515001. ఫోన్: 9493832470 చిరునామాకు పంపించాలని కోరారు.
చివరి తేదీ 30/06/2022 .