డా. వాణీ దేవులపల్లి కవిత : పునర్నవం

Published : Apr 03, 2023, 01:58 PM ISTUpdated : Apr 03, 2023, 01:59 PM IST
డా. వాణీ దేవులపల్లి కవిత : పునర్నవం

సారాంశం

దుఃఖానంతర దృశ్యం స్నేహ హస్తమైనప్పుడు నా కళ్ళల్లో చిప్పిల్లిన కన్నీళ్ళిప్పుడు ఆనంద భాష్పాలే నేస్తం!! అంటూ హన్మకొండ నుండి  డా. వాణీ దేవులపల్లి రాసిన కవిత ఇక్కడ చదవండి : 

జీవితం మళ్లీ కొత్తగా స్పర్శించి
ఆత్మీయ కరచాలనమైనప్పుడు
బతుకు విలువేంటో తెలిసింది!!

మేఘ మల్ హర్ రాగమై
మళ్లీ కొత్తగా వర్షించి..
దుఃఖానంతర దృశ్యం
స్నేహ హస్తమైనప్పుడు
పునర్నవమైంది హృదయం!!

ఆ మోడు చిగురించి పుష్పించి
ఆశల హరివిల్లై పలకరిస్తే
మనసు రాగ రంజిత పాటై పల్లవించింది!!

ఆ అనుభూతుల పూలచెండ్లు
జ్ఞాపకాల పరిమళమై పరవశించి
గుండెలను ఆర్తిగా అపురూపంగా
హత్తుకుంటే...
ఒట్టు!
నా కళ్ళల్లో చిప్పిల్లిన కన్నీళ్ళిప్పుడు
ఆనంద భాష్పాలే నేస్తం!!

-డా. వాణీ దేవులపల్లి
9866962414

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం