అన్నవరం దేవేందర్ 'గవాయి'కి సినారె సాహితీ పురస్కారం

By SumaBala Bukka  |  First Published Apr 1, 2023, 11:12 AM IST

ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ ' గవాయి' కవితా సంపుటికి  సినారె సాహితీ పురస్కారం ప్రధానం చేస్తున్నట్లు సాహితీ గౌతమి ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 


ఏప్రిల్ 2 ఆదివారం రోజు సాయంత్రం కరీంనగర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో పురస్కారోత్సవ సభ జరుగుతుందని ఆయన తెలిపారు . సాహితీ గౌతమి గత 31 ఏళ్లుగా  పోటీకి వచ్చిన కవిత్వ సంకలనాల్లో న్యాయ నిర్ణీతలచే ఎంపిక చేసి ప్రకటిస్తుందని అన్నారు. అన్నవరం దేవేందర్' గవాయి ' కవితా సంకలనం 2021 సంవత్సరానికి చెందిన 32వ పురస్కారం అని తెలిపారు.  కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య ' సాహితీ గౌతమి' నిర్వహిస్తున్న ఈ సభకు పురస్కార కమిటీ అధ్యక్షులు ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి అధ్యక్షతవహిస్తారు.

ముఖ్యఅతిథిగా  తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరవుతున్నారు. సమావేశంలో సాహితీ గౌతమి అధ్యక్షులు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ గాజుల శ్యాం ప్రసాద్ లాల్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్, సాహితీ గౌతమి కార్యనిర్వాహక అధ్యక్షుడు గాజుల రవీందర్ లు పాల్గొంటున్నారని నంది శ్రీనివాస్ ఆ ప్రకటనలో తెలిపారు.

Latest Videos

కాగా పురస్కారం పొందుతున్న అన్నవరం దేవేందర్ కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవి రచయిత.  మీరు ఇప్పటివరకు 12 కవితా సంపుటాలు, రెండు వ్యాస సంకలనాలు మరో రెండు ఇంగ్లీష్ అనువాద కవిత్వ సంకనాలు వెలువరించారు. వీరికి గతంలో తెలుగు విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ సాహిత్య పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు వచ్చాయి.
 

click me!