నేడు శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత ' కవితా రవి ' ఇక్కడ చదవండి :
అక్షరానికి అగ్ని తొడిగి
కవిత్వాన్ని ఆయుధంగా
నిలిపిన తపస్వి
జనహిత మార్గంలో
ఆలోచనలను మలచిన
ప్రగతిశీల మార్గదర్శి
రక్త ప్రవాహసిక్తమైన లోకానికి
క్రాంతి దారుల్ని చూపిన
దార్శనిక కవిత్వ యోగి
రణమైన జీవానాల
వ్యధల్ని అవలోకించి
గెలిచి నిలిచే తీరుల్ని
ప్రబోధించిన జనం కవి
ప్రపంచ బాధ ఆయనదే
కన్నీళ్ళు కష్టాలు ఆయనవే
విముక్తి మార్గాలు
ఆయన చూపినవే
పరపీడన నుండి నరజాతి
విముక్తిని కాంక్షించిన
మహాప్రస్ధాన మహాకవికి
సాటిలేని కవితారవికి వందనం