స్వచ్ఛతలో మెరిసిన ఆ నిస్వార్ధ సేవలు ఏమాయేనో! అంటూ హైదరాబాద్ నుండి డా. టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత " ఆ ప్రేమలేవి మనలో !!" ఇక్కడ చదవండి
కనిపించవేల ఈ రోజుల్లో మనలో
చీకటిలో నవ్వుతూ ఎగిరిన ప్రేమలు
వెలుగులో రోదిస్తూ కార్చిన మమతలు
మరలాగా బతుకు తిరిగే మనిషిలో
శిలలాగా పరుచుకుంది మనసులో
విలువలు తులతూగిన ఆ కాలం ఏది?
పూలై పూచిన ఆ సుగంధ బంధ వృక్షాలేవి?
పచ్చని మనసు తీరైన బతుకు ఏది?
ఆశల అద్దంలో మనిషి కదిలే రూపం ఎక్కడ?
స్వచ్ఛతలో మెరిసిన ఆ నిస్వార్ధ సేవలు ఏమాయేనో!
నాడి పట్టిన మెత్తని కరాల కరుణేదో
అస్పష్ట దృష్యమైంది
అయినా కనిపిస్తుంది కదా ఇంకా బతికిన విలువల జీవితం అమూల్య సేవలుగా నేడు
పచ్చని చెట్టు నీడలో ఎదిగిన మొక్కల శ్వాసగా అవనిలో.