డా.టి.రాధాకృష్ణమాచార్యులు కవిత : రెండు బిందువుల మధ్య

By telugu team  |  First Published Oct 20, 2021, 2:46 PM IST

జీవమే జీవితమై తడబడని హారంలా జీవించాలని డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత "రెండు బిందువుల"  మధ్య ఇక్కడ చదవండి:


రెండు బిందువుల మధ్య
నడిచిన దారిలో దూరం 
ఆ రెండు బిందువుల నడుమ
సాచిన రెక్కల ఎగిరిన వేగం 
ఆ రెండు బిందువుల మధ్యన
సన్నని గీతలు కలిసే కాల రేఖలు

ఆ రేఖలు నవ జీవన మయూఖలూ
కొన్ని మాత్రం వక్ర భాషణ తిమిరాలూ
కాలమూ వేగము గుణకంలో దూరం ప్రతిఫలించు
జీవమే జీవితమై తడబడని హారంలా జీవించు
లెక్కలు మనిషికి చిక్కులు విడదీయు సూత్రం
అక్కున చేరిన కలిసిన దిక్కులు
విడి విడి బంధం
సరళరేఖా సంస్కృతిలో నిజ ద్వారాలున్నవి
వక్ర రేఖలో ఎగుడు దిగుడు అపస్వరాల కృతి ఆకృతులున్నయ్

Latest Videos

చెక్కిలి జారిన వర్ణంలో వర్షం బిందువులు
పుక్కిట పట్టిన జ్ఞానంలో హర్షం
అక్షర జీవాలు
మనిషి ఋషి అయినప్పుడు చూడు
బహుశా రెండు బిందువుల మధ్య
దూర తీరాలు మట్టి రేణువులుగా
సమతల ఆకాశంలో గరిక పోచలే అంతా.

click me!