వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా పాండాల మహేశ్వర్ గణేశుడిపై ఓ కవిత రాశారు. ఆ కవితను మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం.
బాద్ర పదశుద్ద చవితియే భాగ్యమవగ
భక్తి శ్రద్దతో మహదేవి యుక్తిగాను!
పసుపు ముద్దతో బొద్దుగా ప్రతిమజేసి
సృష్టిగావించె గణపతినిష్టమును!1
గదను చేతికిచ్చిగడప కావలియుండు
ఎవరు వచ్చి తేమి విడువరాదు?
తల్లి మాటనిలిపి తనయుండు విద్యుక్త
ధర్మమెంచినిల్చె దండి దొరగ!2
శంకరుండువచ్చి వంకేమి లేకుండ
వెళ్ళజూడ తాను ఎవరు నీవు?
మాటవినగలేక మసలుటా తగునెట్లు?
పెద్దవాడవెట్లు ప్రేమలేద?!3
నాకు ప్రశ్నలేస్తు నవ్యతన్ బోధించె
భవ్యతెరుగకుండ బాలనీవు!
మాటమాటపెరిగి మర్యాద తగ్గంగ
ఉభయులెల్ల జోరు యుద్దమాడ 4
అస్త్రశస్త్ర విద్య అన్నితా జూపిస్తు
ఈశ్వరుండు తాను భీతిగొలిపె!
జయముకోరితానుజైమాతయనితల్చి
గదయు నిల్పి గెలిచె గౌరవముగ!5
కోపమెచ్చి శివుడు కోరి త్రిశూలాన్ని
విసిరివేసె తాను వేగిరమున!
గదనుగూడవిసిరె గర్వాన్ని తుంచేయ
యుద్ద భీకరంబు దద్దరిల్లె!7
స్థానబలముదగ్గి తనువుపై తలలేచి
శూలి ఖండనమున నేలరాలె!
మాత రక్షనీదె మాటతప్పితినంటు
అంబతనయుడపుడుయవనికూలె!8
గిరిజ చేరి శంభు కిరికిరికథజెప్ప
తనయుజూసి తల్లి తల్ల డిల్లె!
వేగవంతముగను ఏనుగు శిరసెట్టి
జీవమిచ్చెశివుడు శీఘ్రముగను!9
సిద్దిబుద్ది పతిగ సిరులెల్ల సమకూర్చు
తల్లి దండ్రి సేవ తార్కికముగ!
వాడవాడలెలసి వక్రతుండముతోడ
గుణముకూర్చుజగతికువలయమున!
దీవెనిచ్చెయిలలొ దీక్షగా పండుగ
జరుపుకుంటె జగతి జయము కల్గు!
జ్ఞానదీప్తి హెచ్చి జాగృతంకలుగంగ
విశ్వశ్రేయమెంచు విమలమతులు!11
ఎల్లలోకములకు ఏళికవుగనీవు
ఇంగితాలు నేర్పె విఘ్నరాయ!
సిద్దిబుద్ది పతుడ శిరసొంచి మొక్కెదా
ఎలుక వాహనదొర వేల్పునీవె!12
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature