డాక్టర్ భీంపల్లి తెలుగు రుబాయిలు

By telugu team  |  First Published Oct 15, 2020, 4:14 PM IST

సాహిత్యంలో రుబాయిలకు విశిష్టమైన గుణం, శిల్పం ఉన్నాయి. తెలుగులో కూడా రుబాయిల ప్రాశస్త్యం చూస్తాం. డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రాసిన రుబాయిలను చదవండి.


వివేకంతోనే మనుగడ సాగించాలి ఎపుడైనా
విజ్ఞానంతోనే మనిషి వికసించాలి ఎన్నడైనా
జ్ఞానసంపద అందరి సొత్తు కావాలి
ఎదుగుతూనే ఒదుగుతూ ఉండాలి ఎవరైనా
                     
ముళ్ళున్నాయని గులాబి పరిమళించలేదా ఏమి
బురదుందని కలువ వికసించలేదా ఏమి
ప్రకృతికి అడ్డెవరు ఈ లోకంలో
చూపులేదని బతుకు సాగుతలేదా ఏమి
             
వినయంగా ఉంటేనే గౌరవం ఎవరికైనా
సహనంతో ఉంటేనే ఆదరం ఎప్పటికైనా 
ప్రేమతో జీవిస్తేనే జీవితం ఆనందమయం
నిజాయితీగా బతికితేనే విజయం ఎప్పటికైనా
 
ఓటమి చెందితేనే గెలుపు విలువ తెలుస్తుంది
కష్టపడితేనే ప్రతిఫలం నీకు దొరుకుతుంది
స్వయంకృషితో ఎదిగితేనే మనిషికి మనుగడ
ప్రయత్నం చేస్తేనే ప్రతి విజయం నీదవుతుంది

click me!