జపనీస్ హైకు తెలుగులోనూ ప్రసిద్ధి పొందాయి. అయితే, వాటిని తెలుగులో రాసే కవులు తక్కువగానే ఉన్నారు. వారిలో డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ఒక్కరు. ఆయన రాసిన తెలుగు హైకూలు చదవండి.
పిల్లతెమ్మెర
పరదాను తాకింది
చల్లని గాలి
వసంతోదయం
ప్రకృతి పులకింత
కోయిలగానం
మనోవేదన
విలపించిన హృది
కవితాధార
చల్లనిగాలి
పరిమళాన్ని మోస్తూ
పువ్వు అదృష్టం
కొత్త జన్మకు
ప్రసవం భూమాతదే
నవ్విన విత్తు
గేయప్రవాహం
గాయపడిన మది
హృదయశోకం.