డాక్టర్ బాణాలశ్రీనివాసరావు కవిత : కనిపించనికాలం

Published : Apr 05, 2023, 11:26 AM IST
డాక్టర్ బాణాలశ్రీనివాసరావు కవిత : కనిపించనికాలం

సారాంశం

పచ్చని ప్రకృతి   రాళ్ళవానగా రాలిపడుతూ భూమాత ఒడిలోకి ఆవిరౌతున్న కనిపించని కాలం అంటూ డాక్టర్ బాణాల శ్రీనివాసరావు రాసిన కవిత  ' కనిపించనికాలం ' ఇక్కడ చదవండి : 

ఆత్మలు ప్రవహిస్తున్న నదుల్లో
మెరుస్తున్న ఆకాశం…
ఆవిర్ని తాగి …
ప్రాణాన్ని కురిసే మేఘాలు 
దాహం తీరిన కొమ్మల్లో
వికసిస్తున్న పూలు
ప్రభాతంతో మమేకమై 
కొత్త ప్రాణం పోసుకొని 
నిద్రపోతున్న సూర్యున్ని
లేపుతున్న ఉదయంపక్షులు                
జాబిల్లిని వెతుక్కుంటూ
కనుమరుగౌతున్న సాయత్రం                
గాలి జోరులో కొట్టుకుపోతున్న
జీవంలేని ఆకుల నీడల్లో
కనిపించని ఇంద్రధనుస్సులు      
సముద్రాన్ని బొట్టు పెట్టుకున్న
పచ్చని ప్రకృతి                     
రాళ్ళవానగా రాలిపడుతూ
భూమాత ఒడిలోకి
ఆవిరౌతున్న కనిపించని కాలం
                                        డాక్టర్ బాణాల శ్రీనివాసరావు
                                        9440471423

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం