ఇడికూడ చిదానందంకు డాక్టరేట్

By Siva Kodati  |  First Published Apr 4, 2023, 6:38 PM IST

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో  " పెన్నా శివరామకృష్ణ సాహిత్యం - సమగ్ర అధ్యయనం "  అనే అంశం మీద పర్యవేక్షకులు  ఆచార్యులు డా. ఎస్. రఘు  ఆధ్వర్యంలో ఇడికూడ చిదానందం పరిశోధనకు గాను యూనివర్సిటీ అధికారులు డాక్టరెట్ ను ప్రకటించారు


ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో  " పెన్నా శివరామకృష్ణ సాహిత్యం - సమగ్ర అధ్యయనం "  అనే అంశం మీద పర్యవేక్షకులు  ఆచార్యులు డా. ఎస్. రఘు ఆధ్వర్యంలో ఇడికూడ చిదానందం పరిశోధనకు గాను యూనివర్సిటీ అధికారులు డాక్టరెట్ ను ప్రకటించారు.  ప్రాధమిక విద్య నుండి ఇంటర్  వరకు చండూర్ లో చదివిన వీరు బిఎస్సి ఖైరతాబాద్ ప్రభుత్వ కాలేజీలో, తెలుగు పండిట్ శిక్షణను మిర్యాలగూడలో,  ఎమ్. ఎ తెలుగు  ఉస్మానియా యూనివర్సిటీలో  పూర్తి  చేశారు.  2016లో దేశస్థాయిలో జరిగిన నెట్ పరీక్షలో జూనియర్ రీసెర్చ్ పెల్లోషిప్ కు  అర్హత సాధించారు. 2016 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్ డి లో చేరి , ఇటీవల తమ పరిశోధనను పూర్తి చేశారు. 

వీరు తన పరిశోధనలో కొనసాగుతూనే 2018లో గురుకుల టీజీటీగా ,  2019లో లాంగ్వేజ్ పండిత్ గా ఉద్యోగాలను సాధించారు.  ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, తిప్పాయిగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో ,  తెలుగు భాషోపాధ్యాయులుగా పని చేస్తున్నారు.

Latest Videos

ఇడికూడ చిదానందంకు బాసర సహస్ర కవితోత్సవములో  "  కవి మిత్ర "  బిరుదును, తెలుగు వెలుగు ఫాండేషన్ వారు ఉగాది పురస్కారాన్ని, విశ్వకర్మ పీఠం (గుంటూరు) వారు " విశ్వకర్మ విభూషణ్ "  పురస్కారాలను ఇచ్చి సత్కరించారు. అంతేకాకుండా ఉపాధ్యాయ వృత్తిలో వీరు చేస్తున్న సేవలకు  గాను 2022 లో రంగారెడ్డి జిల్లా మంచాల మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది.

చిదానందం రాసిన విభిన్న తెలుగు ప్రక్రియలకు చెందిన కవితా రచనలు మరియు ఎన్నో పరిశోధనాత్మక సాహిత్య రచనలు అనేక పత్రికల్లో ప్రచూరితమయ్యాయి. వీరు జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పాల్గొని అనేక పత్ర సమర్పణలు కూడా చేశారు. పోటీ పరీక్షలకు చెందిన తెలుగు, తెలంగాణ సాహిత్యాలకు సంబంధించిన అంశాలను " తెలుగు సాహిత్య నందనం " అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.  వీరి సాహిత్య వ్యాసాలు ఏషియా నెట్ న్యూస్ తెలుగు సాహిత్య పేజీలో కూడా చూడవచ్చు
 

click me!