రేపు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన కవిత్వంతో అభినందన చర్చ జూమ్ అంతర్జాల వేదికలో జరుగుతుంది :
సృజన సాహితీ నల్లగొండ వారి నిర్వహణలో రేపు అనగా ఏప్రిల్ ఆరవ తేదీన ప్రముఖ సాహితీవేత్త, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన కవిత్వంతో అభినందన చర్చ నిర్వహించబడుతుందని కార్యక్రమ సమన్వయకర్తలు డాక్టర్ మండల స్వామి, సాగర్ల సత్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్ ఆరవ తేదీ సాయంత్రం 6 గంటలకు జూమ్ వేదికగా సంస్థ అధ్యక్షులు పెరుమాళ్ళ ఆనంద్ అధ్యక్షతన జరిగే ఈ చర్చలో డాక్టర్ నాళేశ్వరం శంకరం డా. ఏనుగు నరసింహారెడ్డి కవిత్వం -వస్తు వైవిధ్యం పైన, ఎం నారాయణ శర్మ - ఏనుగు నరసింహారెడ్డి కవిత్వం - శైలి, శిల్పం గురించి, రాపోలు సీతారామరాజు ( దక్షిణ ఆఫ్రికా ) - నీడల దృశ్యం-- పరామర్శ పైన, డాక్టర్ రాయరావు సూర్యప్రకాశరావు - ' నేనే 'కవిత్వం - అనుశీలనం పైన చర్చిస్తారు.
ఇంకా డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య - తెలంగాణ రుబాయిలు - అవలోకనం, డాక్టర్ పోరెడ్డి రంగయ్య - పాట - గ్రామీణ జీవన చిత్రణ, డాక్టర్ కొండపల్లి నిహారిణి ( అమెరికా ) - కొత్త పలక - కవిత్వ సౌందర్యం, ఏభూషి నరసింహ - సమాంతర స్వప్నం - పరిశీలన, వాసర చెట్ల జయంతి - పూల పూల వాన - ఒక విశ్లేషణ, ఉప్పల పద్మ - మూలమలుపు పైన సమీక్ష చేస్తారని
వారు పేర్కొన్నారు. సాహిత్య అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/82951345139?pwd=MnFXVEFDajVUdHFyNS82SVdOL3dDZz09
Meeting ID: 829 5134 5139
Passcode: 223344