తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) జనగామ జిల్లా ఆధ్వర్యంలో జనగామ నియోజక వర్గ స్థాయి సదస్సు ఆదివారం అనగా తేది 19-11-2023న సాయంత్రం 4 గంటలకు గాయత్రి ఫంక్షన్ హాల్, సిద్దిపేట రోడ్, జనగామలో నిర్వహించబడుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి :
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామిక తెలంగాణ సాకారం చేసుకోవడంలో మేధావుల బాధ్యత , గడిచిన పదేండ్ల తెలంగాణలో ప్రజలకు అందినదేమిటి? ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు సాకారమయ్యాయి? తదితర అంశాలపై చర్చించడానికి TPJAC జనగామ జిల్లా ఆధ్వర్యంలో జనగామ నియోజక వర్గ స్థాయి సదస్సు ఆదివారం అనగా తేది 19-11-2023న సాయంత్రం 4 గంటలకు గాయత్రి ఫంక్షన్ హాల్, సిద్దిపేట రోడ్, జనగామలో నిర్వహించబడుతోంది.
TJS అధ్యక్షులు ప్రోఫెసర్ కోదండ రామ్, TPJAC కోకన్వీనర్ కన్నెగంటి రవి, TPJAC కోకన్వీనర్ అంబటి నాగయ్య , మాజీ శాసనసభ్యులు సి హెచ్. రాజారెడ్డి (సిపిఐ)లు ప్రసంగించే ఈ సభకు ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజా ప్రయోజనాలను కాంక్షించే వారందరూ తప్పక హాజరు కావాలని TPJAC బాధ్యులు ఏ నర్సింహారెడ్డి కోరుతున్నారు.