తెలంగాణ పద్మశాలి సంఘం సాహిత్య విభాగం చైర్మన్ గా డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్...

Published : Apr 24, 2023, 12:18 PM ISTUpdated : Apr 24, 2023, 12:25 PM IST
తెలంగాణ పద్మశాలి సంఘం సాహిత్య విభాగం చైర్మన్ గా డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్...

సారాంశం

తెలంగాణ పద్మశాలి సంఘం సాహిత్య సాంస్కృతిక విభాగం ఛైర్మన్ గా భీంపల్లి శ్రీకాంత్ నియమితులయ్యారు.  

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సాహిత్య, సాంస్కృతిక విభాగం చైర్మన్ గా డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్  నారాయణగూడలోని పద్మశాలి భవనంలో జరిగిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరింగింది. ఇందులో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మచ్చ ప్రభాకరరావు చేతులమీదుగా భీంపల్లి శ్రీకాంత్ నియామకపత్రాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలోనే భీంపల్లి శ్రీకాంత్ రచించిన "తెలంగాణ బాపూజీ, పద్మశాలి మొగ్గలు" కవితా సంపుటాలను శాసనమండలి సభ్యులు ఎల్.రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణిలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు. భీంపల్లి నియామకం పట్ల జిల్లా పద్మశాలి సంఘం, పట్టణ పద్మశాలి సంఘం,  పట్టణ యువజన సంఘాలతో పాటు ఇతర సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశాయి.
 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం