అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం

Published : Jan 28, 2025, 06:28 PM ISTUpdated : Jan 28, 2025, 06:55 PM IST
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం

సారాంశం

అయోధ్య రామాలయ నిర్మాణం భారత జాతి ఆత్మగౌరవాన్ని పెంచింది. శతాబ్దాల విదేశీ దండయాత్రలు, దారుణాల గురించి తెలుసుకోవడం ద్వారా ఈ క్రతువు యొక్క గొప్పతనం అర్థమవుతుంది. సీనియర్ జర్నలిస్టు వెంకూ రాసిన "అపరాజిత - అయోధ్య" పుస్తకం ఈ చరిత్రను వివరిస్తుంది.

అయోధ్యా మథురా మాయా కాశీ కాంచీ అవంతికాపురీ, ద్వారవతీచైవ సప్తయితే మోక్షదాయక:.. అని పురాణ ప్రవచనం...
మన దేశంలోని ఏడు మోక్ష పట్ణణాలివి. 
ఈ ఏడింటిలోనూ అగ్రతాంబూలం దక్కింది అయోధ్యకే. 
రామనామం తలచుకుంటే చాలు రామరాజ్యంతో పాటు అయోధ్య గుర్తుకొస్తాయి. ఆ వెంటనే విదేశీ దండయాత్రలు.. శతాబ్దాల వివాదం.. దశాబ్దాల పోరాటం మదిలో మెదులుతాయి. రాముడు పుట్టిన గడ్డపైనే ఆయనకు ఆలయం లేకపోవడం ఎన్నో శతాబ్దాలుగా హైందవ జాతిని కుంగదీసింది. సరిగ్గా ఏడాది క్రితం ఈ కల సాకారం కావడంతో ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా పండగ చేసుకున్నారు . 
భరత జాతి ఆత్మగౌరవం మళ్లీ తలెత్తుకు నిలిచిన వేళ అది. 
చరిత్ర తెలియని చాలామందికి ఈ క్రతువు అంత గొప్పదిగా అనిపించకపోవచ్చు.. భరతజాతి హననానికి.. ఈ గడ్డ మీద ఎంతోమంది పూర్వీకుల అణచివేతకు కొన్ని శతాబ్దాల పాటు జరిగిన దండయాత్రలు, దారుణాలు, కిరాతకాలు, అత్యాచారాలు.. వీటన్నింటి గురించి తెలుసుకుంటే నేటి రామాలయ నిర్మాణం ఎంత గొప్పదో.. దేశ చరిత్రలో ఎంత సమున్నతమైనదో అర్థమవుతుంది. 
ఒకసారి గత చరిత్రను.. శతాబ్దాల పాటు సాగిన అణచివేతను, హిందూ జాతిపై, దేవాలయాలపై జరిగిన దాడులను, దోపిడీలను గుర్తు చేస్తూ. . సీనియర్ జర్నలిస్టు  MSR వెంకట రమణ (వెంకూ) రాసిన పుస్తకం.. "అపరాజిత - అయోధ్య"
మీరు చదవండి.. మీ స్నేహితులకు షేర్ చేయండి..ఈ పుస్తకాన్ని ఈ లింక్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
తపనతో కథలు రాస్తున్నాను... ! 'సీతంబాయి పొలం' కథల సంపుటి ఆవిష్కరణలో అయోధ్యారెడ్డి