అభయ్ కె. కుమార్ ఇంగ్లీష్ లో రాసిన Earth Anthem అనే ఆంగ్ల కవితను ప్రముఖ కవయిత్రి మహె జబీన్ తెలుగులోకి ధరిత్రి గీతం పేర అనువదించారు. ఆ కవితను ఇక్కడ చదవండి.
భూమి అందమైంది విశ్వంలో
ఊదా రంగు ముత్యమై కనిపిస్తుంది రోదసి నుండి
ద్వీపాలు, సాగరాలు, ఖండాలు, దేశాలు
అన్ని ఒకే చోట భూమి మీద
వృక్షాలు, జంతువులు, పక్షులు
మనతో పాటు కలిసి బ్రతికే చోటు భూమి
అనేక ప్రపంచ సంస్కృతులు
నలుపు తెలుపు గోధుమ వర్ణం మనుషులు
అందరు ఒకే చోట సహజీవనం
ఏకత్వంలో భిన్నత్వమంటే ఇదే మరి
భిన్నత్వంలో ఏకత్వం కూడా
అనేక భాషలు విభిన్న వర్ణాలు
అన్ని ఒకే చోట అది భూమి
అది మన ఇల్లు
భూమి మనుషుల ఇల్లు
కలిసి అందరం
ఈ నీలి రంగు ముత్యాన్ని కాపాడుదాం
ధరిత్రి పాట పాడుదాం
ఇంగ్లీష్: అభయ్.కె. కుమార్
తెలుగు: మహె జబీన్
(అభయ్ కె. కుమార్ ఇంగ్లీష్ లో రాసిన ఈ కవిత పేరు Earth Anthem. అనేక ప్రపంచ భాషల్లో అనువదించ బడింది. Abhay K. Kumar is a Poet and Indian Diplomat. Mahe Jabeen is a Lawyer for Human Rights)