ఒకరినొకరు కలుసుకున్నారు. ప్రేమించుకున్నారు. కలిసి సహజీవనం కూడా చేశారు. కొద్ది కాలానికి యువతిపై యువకుడు మొహం మొత్తింది. ఇంకేముంది సింపుల్ బ్రేకప్ చెప్పేశాడు. కానీ ఆ యువతి మాత్రం ఆ విషయాన్ని సింపుల్ గా తీసుకోలేక పోయింది.
ఒకరినొకరు కలుసుకున్నారు. ప్రేమించుకున్నారు. కలిసి సహజీవనం కూడా చేశారు. కొద్ది కాలానికి యువతిపై యువకుడు మొహం మొత్తింది. ఇంకేముంది సింపుల్ బ్రేకప్ చెప్పేశాడు. కానీ ఆ యువతి మాత్రం ఆ విషయాన్ని సింపుల్ గా తీసుకోలేక పోయింది. ఎలాగూ విడిపోతున్నాం కదా.. చివరి సారిగా నాకు ముద్దు పెట్టగా అని గోముగా అడిగింది. ఆమె మాటలకు కరిగిపోయి ఆ యువకుడు ముద్దు కోసం సై అని పెదవులు కలిపేశాడు. కాసేపు ముద్దుపెట్టినట్లు నటించి.. అతనిపై కోపాన్ని తీర్చుకుంది. నాలుకను తెగేవరకు కొరికేసింది. ఈ సంఘటన బార్సీలోనాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... బార్సిలోనాకి చెందిన ఓ యువతికి 2016లో ఓ డేటింగ్ యాప్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నాక యువతి ఇంట్లోనే సహజీవనం చేయడం ప్రారంభించారు. నాలుగు నెలలు గడిచిన తర్వాత యువకుడి ఆమె పట్ల మోజు తీరిపోయింది. దీంతో విడిపోదామని భావించాడు.
ఇదే విషయాన్ని ఆ యువతికి చెప్పాడు. మొదట ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. నోటికి వచ్చినన్ని తిట్లు నటించింది. తన ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మంటూ అరిచేసింది. అతను దానికి సిద్ధపడటంతో వెంటనే మనసు మార్చుకున్నట్లు నటించింది. తనదే తప్పు అంటూ క్షమాపణలు చెప్పింది. చివరిసారిగా తనకు ముద్దు పెట్టి... ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకుందాం అని రిక్వెస్ట్ చేసింది.
ఇన్నాళ్లు కలిసి ఉన్నాం.... చివరిసారిగా ముద్దే కదా అడుగుతోందని ఆ యువకుడు కూడా చివరి ముద్దు కి ఒకే చెప్పాడు. ముద్దు పెట్టినట్లే పెట్టి... నాలుక తెగి ఊడిపడే దాక కొరికేసింది. నాలుక తెగి అతను ప్రాణం పోయేలా అరుస్తుంటే.. అక్కడి నుంచి పరారయ్యింది. అతని అరుపులు విన్న పక్కింటి వారు వచ్చి అతనిని ఆస్పత్రికి తరలించారు.
బాధితుడు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించగా... న్యాయస్థానం ఆమెను మందిలించి వదిలేసింది. అయితే.. యువకుడు మాత్రం ఆమెకు కనీసం 8ఏళ్ల జైలు శిక్ష వేయాలని పట్టుపడటం గమనార్హం. ఆ యువతి మాత్రం ఈ విషయంలో తప్పు చేశాననే భావనలో లేదు. తాను చేసింది నూటికి నూరు శాతం కరక్టేనని వాదించడం విశేషం.