పదేళ్ల వయసు చేరుకునే సమయానికి పిల్లలకు మంచి ఆహారం తీసుకునే అలవాటు చేయాలి. జంక్ ఫుడ్స్ కాకుండా బలవర్థకమైన ఆహారం అందజేస్తే... మంచి ఎత్తు, బరువు పెరిగి బలంగా తయారౌతారు.
పిల్లలు తీసుకునే ఆహారమే వాళ్ల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. వయసును బట్టి పిల్లల ఆహారంలో మార్పులు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా పది నుంచి పదిహేను ఏళ్లు పిల్లల్లకు సరిగ్గా ఎదిగే వయసు. ఈ దశలో పిల్లల ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. ఈ వయసు నుంచి పిల్లలకు ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
పదేళ్ల వయసు చేరుకునే సమయానికి పిల్లలకు మంచి ఆహారం తీసుకునే అలవాటు చేయాలి. జంక్ ఫుడ్స్ కాకుండా బలవర్థకమైన ఆహారం అందజేస్తే... మంచి ఎత్తు, బరువు పెరిగి బలంగా తయారౌతారు. పోట్రీన్లు ఎక్కువగా ఉండే ఆహారం అందజేయాలి. చాలా మంది పిల్లలకు చాక్లెట్స్, స్వీట్లు, చీజ్ వంటివి ఇష్టంగా తింటూ ఉంటారు. వాళ్ల శరీరంలోని విటమిన్ లోపం కారణంగానే వాటిని తినడానికి పిల్లలు ఇష్టపడుతుంటారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పిల్లల ఆహారంలో కచ్చితంగా ఉండాల్సిన పదార్థాలు ఇవి...
గుడ్లు, ఆకుకూరలు, తాజా పళ్లు, కూరగాయలు
బాదం, వాల్‌నట్స్, వేరుసెనగలు
గోధుమలు, పెసలు, పాలు, వెన్న, పెరుగు
మాంసం, చేపలు, జున్ను
రాజ్మా, సెనగలు, బొబ్బర్లు
పిల్లలకు సాయంత్రం అల్పాహారంగా బాదం, పిస్తా, వాల్‌నట్స్, ఉడకబెట్టిన సెనగలు, మొక్కజొన్నలాంటివి ఇస్తే జంక్ ఫుడ్స్ మీదకు మనసు మళ్లకుండా ఉంటుంది. పిల్లలు జంక్‌ఫుడ్‌కి అలవాటు పడిన తర్వాత వాళ్ల ఆహారంలో మార్పులు చేయటం కాకుండా అంతకంటే ముందే ఇలాంటి ఆహార నియమాలను వాళ్లకు అలవాటు చేయగలిగితే జంక్ ఫుడ్‌కి అలవాటు పడకుండా ఉంటారు.