పోలీసులకు భయపడి పారిపోతూ... బావిలో పడి యువకుడి మృతి (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 09, 2020, 09:28 PM IST
పోలీసులకు భయపడి పారిపోతూ... బావిలో పడి యువకుడి మృతి (వీడియో)

సారాంశం

పోలీసులకు భయపడి పారిపోతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృత్యువాతపడ్డాడు. 

కరీంనగర్: మూడు రోజుల క్రితం ఓ కేసు విషయమై టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడంతో భయపడి పారిపోయిన ఓ యువకుడి మృతదేహం బుధవారం వ్యవసాయ బావిలో లభ్యమయ్యింది. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...కరీంనగర్  జిల్లా  గంగాధర మండలం గోపాల్ రావు పల్లి గ్రామంలో వ్యవసాయ బావిలో పడి సాయి అనే యువకుడు మృతి చెందాడు. మూడు రోజుల క్రితం  టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ కేసు విషయంపై రావడంతో భయపడి పారిపోయిన యువకుడు సాయి(లడ్డు) పారిపోతుండగా వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. 

"

దీంతో తమ కొడుకు మరణానికి టాస్క్ ఫోర్స్ పోలీసులే కారణామని మృతుడి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే అక్రమ కేసులు పెట్టి తమ కొడుకును నాలుగు నెలలు జైల్లో ఉంచారంటూ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించనివ్వకుండా పోలిసుల వాహనాల ముందు బైఠాయించారు. అయితే వారిని పక్కకు జరిపి మృతదేహాన్ని కరీంనగర్ కి తరలించారు. దీంతో గంగాధరకి చేరుకున్న సాయి స్నేహితులు, బంధువులు జగిత్యాల, కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించిన ఆందోళన చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు