సిరిసిల్లాలో కరోనాతో వీఆర్వో మృతి...

By AN Telugu  |  First Published May 8, 2021, 2:19 PM IST

సిరిసిల్ల రాజన్న జిల్లాలో కరోనా బారినపడి ఓ వీఆర్వో మృతి చెందాడు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన గట్టు స్వామి (42) సంవత్సరాలు తంగళ్ళపల్లి మండలంలో విఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్నారు. 


సిరిసిల్ల రాజన్న జిల్లాలో కరోనా బారినపడి ఓ వీఆర్వో మృతి చెందాడు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన గట్టు స్వామి (42) సంవత్సరాలు తంగళ్ళపల్లి మండలంలో విఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్నారు. 

ఆయనకు కరోనా సోకడంతో పది రోజులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు జిల్లా ఏర్పడ్డాక జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన మృతి పట్ల జిల్లా రెవెన్యూ అధికారులు వీఆర్వోలు సంతాపం వ్యక్తం చేశారు.

Latest Videos

undefined

నానాటికీ కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువుతోంది. తాజాగా జరిగిన మరో ఘటనలో కరోనా కాటుకు కొడుకు బలి  కావడంతో..  తట్టుకోలేక ఆ తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పాపన్నపేట మండల పరిధిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేట గ్రామానికి చెందిన కొమ్మ రమేష్‌గుప్తా (39) వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కుమారుడు చనిపోయిన నాటి నుంచి బెంగ పెట్టుకున్న మృతుడి తండ్రి ఈశ్వరయ్య (90) వారం రోజులు గడువకముందే గురువారం రాత్రి మరణించాడు. 

ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకులు మరణించడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగారు. మృతుల కుటుంబాలకు ఎంపీపీ చందనా ప్రశాంత్‌రెడ్డి, సర్పంచ్‌ బాపురెడ్డి, పలువురు గ్రామపెద్దలు ప్రగాఢ సంతాపం తెలిపారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona
 

click me!