అబ్దుల్లాపూర్‌మెట్ సీన్ రివర్స్... మహిళా రైతుపై కారంపొడి చల్లి వీఆర్వో దాడి

By Arun Kumar PFirst Published Nov 28, 2019, 3:48 PM IST
Highlights

ఓ మహిళా రైతు తన పొలానికి సంబంధించిన పని చేసిపెట్టమన్నందుకు ఓ వీఆర్వో  ఏకంగా ఆమెపై కారంపొడి చల్లి దాడికి పాల్పడిని సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మహిళా రైతుపై ఓ ప్రభుత్వాధికారి విచక్షణారహితంగా దాడికి పాల్సడిన ఘటన వెలుగుచూసింది. ఈ దాడికి పాల్పడిని అధికారి కూడా ఓ మహిళే కావడం గమనార్హం. సాటి మహిళ సమస్యను పరిష్కరించాల్సింది పోయి భారీ  మొత్తంలో లంచం తీసుకుని కూడా పనిచేయలేదని సదరు మహిళా అధికారిణిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంథని మండలం అడవి సోమన్ పల్లి గ్రామానికి వీఆర్వోగా సహిరబాను వ్యవహరిస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన సమ్మక్క తన భూమి పట్టా కోసం మండల కార్యాలయం, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది.  అయినప్పటికి పని కాకపోవడంతో చివరకు వీఆర్వో కు రూ.30 వేలు లంచంగా ఇచ్చి పని చేసిపెట్టమని కోరింది. 

అయిప్పటికి పని కాకపోవడంతో విసిగిపోయిన సమ్మక్క నేరుగా వీఆర్వో ఇంటికి వెళ్లి నిలదీసింది. దీంతో ఆగ్రహానికి లోనయిన సహిరాభాను బాధిత మహిళతో వాగ్వాదానికి దిగి చివరకు ఇంట్లోంచి కారంపొడిని తీసుకువచ్చి ఆమెపై చల్లి దాడికి పాల్పడింది. 

ఈ ఘటనలో గాయపడ్డ సమ్మక్క నేరుగా స్థానిక పోలీస్ట్ స్టేషన్ కు వెళ్లి వీఆర్వోపై పిర్యాదు చేసింది. తన వద్ద లంచం తీసుకోవడమే కాదు దాడి కూడా చేసినట్లు సదరు మహిళా రైతు ఫిర్యాదులో పేర్కొంది.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Chalo Amaravathi : చంద్రబాబు బస్సుపై చెప్పు విసిరిన ఆందోళన కారులు
 

click me!