వేములవాడ కాంగ్రెస్ ఇంచార్జి ఆది శ్రీనివాస్ హౌస్ అరెస్ట్

By Arun Kumar PFirst Published Mar 6, 2020, 1:57 PM IST
Highlights

టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్  రెడ్డి అరెస్ట్ ను నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి.  

కరీంనగర్: నిన్న(గురువారం) హైదరాబాద్ లో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా డ్రోన్ కెమెరాలు వినియోగించారన్న అభియోగాలతో ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ ను నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. 

ప్రస్తుతం జైల్లో వున్న రేవంత్ రెడ్డిని కలిసేందుకు అనుచరులతో కలిసి  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుండి హైదరాబాద్ కు వెళ్లడానికి ప్రయత్నించిన నియోజకవర్గ ఇంచార్జీ ఆది శ్రీనివాస్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు ఇంట్లోంచి బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. 

read more   చంచల్‌గూడ జైలుకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

అలాగే రేవంత్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఇల్లందకుంట మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి చేరుకుని వాహనాల రాకపోకలను అడ్డుకుని రాస్తారోకో నిర్వహించారు. 

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తెలంగాణా తల్లి విగ్రహం వద్ద మంత్రి కెటిఆర్ దిష్టిబొమ్మ దగ్దం చేసి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసన తెలియజేస్తున్న కాంగ్రేస్ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. 

read more  గోపన్‌పల్లి భూములు: హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి అరెస్ట్ ను నిరసిస్తూ పెద్దపల్లి పట్టణంలోని కమాన్ చౌరస్తా వద్దగల రాజీవ్ రహదారిపై మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో చేపట్టారు.. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని దగ్ధం చేశారు.  

click me!