RTC Strike:తెలంగాణ బిజెపివి మాటలే...చేతలెక్కడ...: పొన్నం ప్రభాకర్

By Arun Kumar PFirst Published Oct 25, 2019, 5:52 PM IST
Highlights

ఆర్టీసి సమ్మె విషయంలో తెలంగాణ బిజెపి చిత్తశుద్దితో పనిచేయడం లేదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్రం తలుచుకుంటే కార్మికుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.  

కరీంనగర్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం బిజెపి పార్టీ చిత్తశుద్దితో ప్రయత్నించాలని టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తమ  అధినాయత్వం రంగంలోకి దిగేలా రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చొరవ తీసుకోవాలని సూచించారు. అంతేగానీ వట్టి ఓదార్పు వ్యాఖ్యలతో సరిపుచ్చి ఆర్టీసీ కార్మికులకే తమ మద్దతు అంటే సరిపోదని పొన్నం ఎద్దేవా చేశారు.

 సమ్మె 21 రోజుల నుండి జరుగుతున్నా రాష్ట్ర బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. అడపా దడపా ప్రకటనలు తప్ప ఉద్యమాన్ని పటిష్టం  చేయడానికి కార్యచరణ గానీ, పరిష్కరించే ప్రయత్నం గానీ చేయలేదన్నారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర బీజేపీ నీయకులు సమ్మె పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవలని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మెపై బిజెపి కేవలం ఓదార్పు మాటలే మాట్లాడుతుంది తప్ప ఏం చేయడంలేదన్నారు.

read more   RTC strike video : అశ్వత్థామ రెడ్డిపై బస్ డ్రైవర్ కేసు

ఇరవైఒక్క రోజులుగా సమ్మె జరుగుతుంటే ప్రజాజీవనం స్తంభించిపోవడం లక్ష్మణ్ కు కనబడడం లేదా అని అన్నారు. కార్మికులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీ ప్రేక్షకపాత్ర వహించడం మంచిదికాదన్నారు.

నిజంగా ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి కేంద్రం పక్షాన ఏం చర్యలు తీసుకుంటున్నారో బీజేపీ తెలపాలన్నారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసి చాలా రోజులు అయిందని... కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కోసం కేంద్రం నుండి ఎలాంటి చర్యలు లేవని తెలిపారు.

గురువారం సాయంత్రం సిఎం కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ సీరియస్ గా పరగణించాలని  సూచించారు. ఆర్టీసి సమ్మెపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా రాష్ట్ర బీజేపీ కృషి చేయాలని సూచించారు.

read more నాపై కేసులు పెట్టించిందెవరో తెలుసు: కేసీఆర్ కు అశ్వత్థామ సవాల్

రాష్ట్ర ప్రజలు, ప్రజా రవాణా సంస్థ ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వనికి ఆదేశాలు జారీ చేసి ఆర్టీసీ కార్మిక వర్గానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 

ఇందుకోసం రాష్ట్ర బిజెపి మాటలో కాకుండా చేతలతో పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. లేకపోతే బీజేపీ,టిఆర్‌ఎస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీలేనని ఇప్పటికే ప్రజలు భావిస్తున్నారని... అది నిజమయ్యే అవకాశాలున్నాయని పొన్నం పేర్కొన్నారు. 
 

click me!