ఫెమా నిబంధనలు ఉల్లంఘించలేదు: ఈడీ నోటీసులపై గంగుల కమలాకర్

By narsimha lode  |  First Published Sep 5, 2023, 2:39 PM IST

ఈడీ నోటీసుల విషయమై  మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.  ఈడీ నోటీసులు అందలేదన్నారు. ఈడీ నోటీసులు జారీ చేస్తే వివరణ ఇస్తామన్నారు. శ్వేత గ్రానైట్ కంపెనీ విషయమై ఈడీ నోటీసులు జారీ చేసినట్టుగా ఇవాళ మీడియా ప్రసారం చేసింది.  


హైదరాబాద్:ఈడీ నోటీసులు అందలేదని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
 మంగళవారంనాడు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్  కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు.   మాజీ మంత్రి గంగుల కమలాకర్  కుటుంబ సభ్యులకు  ఈడీ నోటీసులు అందించినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ విషయమై  మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.  ఈడీ నోటీసులు అందించినట్టుగా  మీడియాలో వార్తలు చూసినట్టుగా  చెప్పారు. తనకు  ఈడీ నుండి నోటీసులు అందలేదన్నారు.  ఈడీ నోటీసులు అందిస్తే  సమాధానమిస్తానన్నారు.  గతంలో  ఈడీ నోటీసులకు సమాధానమిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఈడీ అధికారులు ఏ డాక్యుమెంట్ అడిగినా ఇవ్వడానికి సిద్దంగా  ఉన్నట్టుగా ఆయన  చెప్పారు.  శ్వేత గ్రానైట్స్ వంద శాతం పారదర్శకంగా ఉందని చెప్పారు. ఫెమా నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించలేదని ఆయన  స్పష్టం చేశారు.ఆర్ బీ ఐ నిబంధనలు పాటించినట్టుగా  ఆయన  వివరించారు.

Latest Videos

undefined

also read:మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు..

చైనాకు  గ్రానైట్స్  ఎగుమతుల్లో అవకతవకలు జరిగినట్టుగా  ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఈ విషయమై 2022 నవంబర్ మాసంలో  శ్వేత గ్రానైట్స్ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.శ్వేత గ్రానైట్స్ సంస్థ  చైనాకు  చేసిన ఎగుమతుల్లో  అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తుంది. ఈ విషయమై గతంలోనే సీబీఐ కేసులు నమోదు చేసింది.ఈ కేసుల ఆధారంగా ఈడీ అధికారులు గత ఏడాదిలో  సోదాలు నిర్వహించారు.  అయితే ఇవాళ ఈడీ నోటీసులు వచ్చినట్టుగా  ప్రచారం సాగింది. అయితే తమకు ఈడీ నోటీసులు అందలేదని గంగుల కమలాకర్ తేల్చి చెప్పారు.

 

click me!