తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. తొలుత ఆయన ముక్తేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కరీంనగర్: తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు మధ్యాహ్నం కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలించారు. సీఎం కేసీఆర్ నిర్ణీత షెడ్యూల్ కంటే మూడున్నర గంటలు ఆలస్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు.
వాస్తవానికి గురువారం నాడు ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలి. కానీ, ఆయన మధ్యాహ్నం 12 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు. కరీంనగర్ కార్పోరేషన్ కు కొత్తగా ఏర్పడిన పాలకవర్గంతో సిఎం కెసిఆర్ ముచ్చటించారు. కరీంనగర్ అభివృద్దికి తీసుకోవల్సిన చర్యల పై వారికి దిశానిర్దేశం చేశారు.
undefined
దీంతో 9 గంటల 25 నిమిషాలకు కాళేశ్వరం చేరుకోవల్సిన సిఎం... 12 గంటల 30 నిమిషాలకు కాళేశ్వరం బయలు దేరారు.తొలుత కాళేశ్వర ముక్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.. అనంతరం అక్కడి నుండి బయల్దేరి గోదావరి ఘాట్ కన్నెపల్లి వద్ద లక్ష్మీపంప్ హౌజ్ ను పరిశీలించారు.
అక్కడి నుండి అంబట్ పల్లి వద్ద గల లక్ష్మీ బ్యారేజ్ మెడిగడ్డబ్యారేజ్ వద్దకు చేరుకుని నీటి నిల్వతో పాటు జరుగుతున్న పనుల తీరును పరిశీలించారు.లక్ష్మీ బ్యారేజీ వద్ద నుండి గోదావరి నదిలోకి సీఎం కేసీఆర్ నాణెలు విసిరాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో మొక్కులను తెలంగాణ సీఎం కేసీఆర్ తీర్చుకొన్నారు.
అక్కడే ఎక్కువ సమయం గడిపి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నుండి మరో టిఎంసి నీటిని ఎత్తిపోసేందుకు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ అనంతరం కరీంనగర్ కు తిరుగు పయనమైకరీంనగర్ ఉత్తర తెలంగాణ భవన్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
కాళేశ్వరం ఇప్పటికే జలకళను సంతరించుకున్న లక్ష్మీబ్యారేజ్ ను పరిశీలించనున్నారు. ఎగువనుంచి క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతుండడంతో లక్ష్మీబరాజ్ నిండుకుండలా దర్శనమిస్తోంది.
బ్యారేజీ పూర్తిస్థాయి సామర్థ్యం 16 టీఎంసీలు,100 మీటర్ల ఎత్తుకాగా ప్రస్తుతం 14 టీఎంసీలకు నీరు ఉండగా 99.400 మీటర్ల ఎత్తులో ప్రవా హం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.తన కలల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకోవడాన్ని చూసేందుకు కెసిఆర్ వచ్చారని తెలుస్తోంది.
దేవతల పేరు పేడితే ఏ పనైనా ఘనంగా ఉంటుందని... అందులో భాగంగానే ఇప్పటికే కళేశ్వరం ప్రాజేక్టులోని బ్యారేజులకు, పంప్ హౌజ్ లకు లక్ష్మీ, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రిలుగా నామకరణం చేశారుఇప్పుడు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెం వద్ద గోదావరి నది పై నిర్మిస్తున్న బ్యారేజీకి... తెలంగాణ వనదేవత సమ్మక్క పేరు పెట్టాలని నిర్ణయించారు.
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులోని మిగతా బ్యారేజ్ లైనా సరస్వతి, పార్వతి బ్యారేజులు సైతం జలకళను సంతరించుకున్నాయి. మరో వైపు ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌజ్,గాయత్రి పంప్ హౌజ్ మీదుగా... వరదకాలువ ద్వారా... గోదావరి జలాలను రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర జలాశయం మిడ్ మానేర్ కు తరలింపు కార్యక్రమం కొనసాగుతుంది..
గత రెండు రోజులుగా 28 వేల 350 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. ప్రస్తుతం మిడ్ మానేర్ కూడా నిండుకుండను తలపిస్తోంది. అయితే మొన్నటి వరకు జలకళ ఉట్టిపడ్డ లోయర్ మానేర్ డ్యామ్తన కళను కోల్పోయింది.
ఎల్ఎండి పూర్తి సామర్ధ్యం 24 టిఎంసీలు కాగా ప్రస్తుతం 8 టిఎంసీల నీరు మాత్రమే నిల్వఉంది.. దీంతో... ఎల్ఎండి కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా మిడ్ మానేర్ నుండి నుండి ఎల్ఎండికి నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్ఎండిలో కూడా 16 నుండి 18 టిఎంసీల నీటిని నిల్వచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
. అయితే... మధ్యాహ్నం వేళ లక్ష్మీ బ్యారేజ్ నుండి తిరుగుపయనం కానున్న సిఎం కెసిఆర్... 2వ రోజు పర్యటన ఆలస్యంగా ప్రారంభం కావడంతో... మళ్ళీ కరీంనగర్ వస్తారా... లేక... తన కరీంనగర్ పర్యటన రద్దు చేసుకుని... నేరుగా హైదరాబాద్ ప్రగతి భవన్ వెళ్తారా వేచి చూడాల్సిందే...