జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి చిన్న అజాగ్రత్త అభం శుభం తెలియని ఓ చిన్నారి బాలున్ని బలితీసుకుంది.
కరీంనగర్: ఆ తల్లి చిన్న అజాగ్రత్త అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకును బలితీసుకుంది. ఏం చేస్తున్నామో... ఏం తింటున్నామో కూడా తెలియని వయసులో సపోటా పండు తిన్న ఓ చిన్నారి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామానికి చెందిన అనుపురం సుజాత-లింగాగౌడ్ దంపతులకు ఇద్దరు కుమారులు.ఉపాధి నిమిత్తం లింగాగౌడ్ సౌదీకి వెళ్ళగా బీడీ కార్మికురాలయిన సుజాత పిల్లలిద్దరిని తీసుకుని ఇక్కడే వుంటోంది.
read more కుటుంబ కలహాలు : అత్తతో గొడవపడి..కొండమీదికి ఎక్కింది...
అయితే సోమవారం సాయంత్రం ఆమె పిల్లల కోసం సపోటా పండ్లు కొని ఇంట్లో పెట్టింది. వాటిని పిల్లలకు తినిపిస్తుండగా రెండో కుమారుడు శివకుమార్(4) గొంతులో సపోటా గింజ ఇరుక్కుంది. దీంతో అతడు శ్వాస ఆడక తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు.
దీంతో కంగారుపడిపోయిన సుజాత కుటుంబసభ్యుల సాయంతో వెంటనే మెట్‌పల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ శివకుమార్ మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.