అనాథ పిల్లలకు ఇల్లు కట్టిస్తున్న ఎస్పీ... అభినందించిన డిజిపి

By telugu team  |  First Published Jun 5, 2020, 4:58 PM IST

అనాథపిల్లల కోసం సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే ఇళ్లు కట్టిస్తున్నారు. అందుకు తెలంగాణ డీడీపీ మహేందర్ రెడ్డి రాహుల్ హెగ్డేను అభినందించారు.


పోలీసుల్లో కూడా మంచి మనసున్నవారు ఉంటారని నిరూపించారు రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే. సిరిసిల్లలో ఇద్దరు అనాథ పిల్లలను చేరదీసి వారికి అన్ని తానై ఉంటానని భరోసా కల్పించారు. అంతేకాదు ఆ అనాథ పిల్లలకు ఇల్లు కూడా కట్టించటానికి సన్నాహాలు చేస్తున్నారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. 

వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన చిన్నారుల తల్లిదండ్రులు గల్ఫ్ కి వెళ్లి అనారోగ్య కారణాలతో చనిపోవటంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. పట్టించుకునే దిక్కు లేకపోవటంతో అదే జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆ చిన్నారుల అమ్మమ్మకి కూడా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆ పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. 

Latest Videos

undefined

గ్రామస్థులు మరియు స్థానిక నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తానే స్వయంగా తనతో పాటుగా కొందరు దాతల చేసిన విరాళాల సహాయంతో ఆ చిన్నారులకి ఇల్లు కట్టించి ఇస్తున్నారు. దాని కోసం ఒక స్ధలం సేకరించి ఇంటికి శంఖుస్థాపన కూడా చేశారు.

గ్రామస్తులందరూ జిల్లా ఎస్పీ చేస్తున్న సహాయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే ని అభినందించారు. పోలీసులు ఉన్నదీ సమాజానికి మంచి చేయటం కోసమేనని ఆ మంచి కోసం పోలీసులు ఏదైనా చేస్తారని అభినందించారు.

 

The Societal Change Agents,. Committed towards by all means & at all costs. https://t.co/M88knbSuOC

— DGP TELANGANA POLICE (@TelanganaDGP)
click me!