పద్నాలుగేళ్లకు గర్భం... తల్లితో పాటు కవల శిశువుల మృతి

Arun Kumar P   | Asianet News
Published : Jun 04, 2020, 07:34 PM IST
పద్నాలుగేళ్లకు గర్భం... తల్లితో పాటు కవల శిశువుల మృతి

సారాంశం

పెళ్లయిన పద్నాలుగేళ్ళ తర్వాత ఆ మహిళ గర్భం దాల్చింది. అయితే ఈ ఆనందం ఎక్కువరోజులు నిలవలేదు. పిల్లలపై ఆశను కల్పించిన దేవుడు ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపాడు.

కరీంనగర్: పెళ్లయిన పద్నాలుగేళ్ళ తర్వాత ఆ మహిళ గర్భం దాల్చింది. దీంతో ఆ కుటుంబమంతా సంతోషంలో మునిగిపోయింది. అయితే ఈ ఆనందం  ఎక్కువరోజులు వుండలేదు. పిల్లలపై ఆశను కల్పించిన దేవుడు ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపాడు. ఎనిమిది నెలలు గర్భిణిగా వున్న  మహిళకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి మహిళతో పాటు పుట్టబోయే కవల పిల్లలు చనిపోయారు. ఈ విషాద సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని చిగురుమామిడి మండలం రేగొండ గ్రామానికి చెందిన జూపాక కనుకయ్య, స్వరూప లకు పద్నాలుగు సంవ్సరాల క్రితం వివాహం అయింది. అయినప్పటికి సంతానం కాకపోవడంతో అనేక అసుపత్రులలో చికిత్స తీసుకున్నారు. చివరకు ఎనిమిది నెలల క్రితం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో IUI ద్వారా స్వరూప గర్భం దాల్చడంతో ఆ కుటుంబమంతా సంతోషపడ్డారు.

read more  లవ్ అఫైర్: సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్య, సూసైడ్ నోట్ లో ఇలా..

వైద్యులు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో స్వరూప తల్లిగారి ఊరు సైదాపూరు మండలం ఎలబోతరం గ్రామంలో ఉంటుంది. ప్రతి నెలా హన్మకొండలోని ఆసుపత్రిలో చికిత్స పొందేది. 

కాని విధి వక్రీకరించి గురువారం ఉదయం స్వరూపకు ఛాతీలో నొప్పి రావడంతో హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తుండగా స్వరూప మృతి చెందింది. మృతురాలి భర్త కనుకయ్య తన భార్య కడుపులో ఉన్న పిల్లలను కాపాడాలని కోరగా వైద్యులు ఆపరేషన్ చేయగా ఇద్దరు కవల పిల్లలు సైతం మృతి చెందారు. తల్లి ఇద్దరు పిల్లలు మృతి చెందటంతో  కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఉన్న వారి రోదనలు మిన్నంటాయి.
 

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు