ఆ లక్ష ఓట్లు టీఆర్ఎస్ కే... తొమ్మిది మున్సిపాలిటీల్లో పెరిగిన అధికారపార్టీ బలం

By Arun Kumar PFirst Published Jan 19, 2020, 4:19 PM IST
Highlights

తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. సింగరేణి ఎస్సీ, ఎస్టీ కేంద్ర ఉద్యోగ సంఘం తమ మద్దతు టీఆర్ఎస్ కే అంటూ లిఖితపూర్వక లేఖను అందించాయి. 

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల కేంద్ర సంఘం సంపూర్ణ మద్దతును ప్రకటించింది.మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు ప్రతినబూనారు.టీఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థుల విజయం కోసం సొంత ఖర్చులతో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.

ఆదివారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను కూకట్ పల్లిలోని ఆయన నివాసంలో కలిసి టీఆర్ఎస్ కు మద్దతునిస్తున్నట్లు ఆ సంఘం కేంద్ర కమిటీ లిఖితపూర్వకంగా లేఖను అందజేసింది.

read more  కరీంనగర్ బిజెపి షాక్... టీఆర్ఎస్ లో చేరిన కీలక నేత 

సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం కేంద్ర కమిటీ టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల బోయినపల్లి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం కేంద్ర కమిటీ నాయకులను వినోద్ కుమార్ అభినందించారు.

ఉమ్మడి నాలుగు జిల్లాల్లోని బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, గోదావరిఖని, భూపాలపల్లి, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు, సత్తుపల్లి మున్సిపాలిటీల పరిధిలో సింగరేణి ఎస్సీ, ఎస్టీ 16 వేల మంది ఉద్యోగులు, కుటుంబ సభ్యుల ఓట్లు కలిపి దాదాపుగా ఒక లక్ష వరకు ఉంటాయని... ఈ ఓట్లన్నీ టీఆర్ఎస్ అభ్యర్థులకే పోల్ అవుతాయని ఆ సంఘం నాయకులు తెలిపారు.

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో సమావేశమైన వారిలో  సింగరేణి సంఘం కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు ఆరేపల్లి రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోళ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి ఆంతోటి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బాణోత్ కర్ణ, నాయకులు మల్లేష్, వెంకటేశ్వర్లు, రాజేశ్వరరావు, పద్మారావు, రమేష్ కుమార్, తదితరులు ఉన్నారు.

click me!