మంత్రి గంగుల ఇంటి ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన

By Siva KodatiFirst Published Oct 13, 2019, 2:33 PM IST
Highlights

సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు కరీంనగర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ఇంటిముందు నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు గంగుల ఇంటి వద్ద భారీగా మోహరించారు. 

సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు కరీంనగర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ఇంటిముందు నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు గంగుల ఇంటి వద్ద భారీగా మోహరించారు. 

మరోవైపు ఆర్టీసీ సమ్మెను తెలంగాణ సాధన ఉద్యం పంథాలో నడపాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. దీనిలో భాగంగా అన్ని వర్గాలను సమ్మెలో భాగస్వామ్యులను చేసేలా ప్రొఫెసర్ కోదండరామ్ కార్యాచరణ రూపొందించారు.

ఈ నెల 13న అన్ని డిపోల ఎదుట వంటావార్పు చేపట్టాలని, ఇందులో కార్మికులతో పాటు ప్రజాసంఘాలు, రాజకీయ నేతలు పాల్గొనేలా చూడాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది.

14న కార్మికులు, వారి కుటుంబసభ్యులతో డిపోల ముందు బైఠాయింపు, ధర్నాలు నిర్వహించనుంది. 15న రాష్ట్రంలోని రహదారులపై రాస్తారోకోలు, 16న అన్ని యూనివర్సిటీల విద్యార్ధి సంఘాలు ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 17న అన్ని డిపోలు ముందు ధూం ధాం, 18న బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. 

click me!