పేకాడుతూ పట్టుబడిన పోలీసుపై సస్పెన్షన్ వేటు

By telugu teamFirst Published Nov 8, 2019, 11:37 AM IST
Highlights

విశ్వనాథ్ అనే పోలీస్ కానిస్టేబుల్ పేకాడుతూ పోలీసులకు చిక్కాడు. అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. పోలీసు శాఖలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని రామగుండం పోలీసు కమిషనర్ హెచ్చరించారు.

కరీంనగర్: గురువారం రాత్రి హనుమాన్ నగర్ లో ఒక బిల్డింగ్ పై పేకాట ఆడుతున్నారని డైల్ 100 ద్వారా సమాచారం రాగా  వన్ టౌన్  పోలీసులు అక్కడ కి  వెళ్లారు. అక్కడ పేకాట ఆడుతూన్న వారిలో  స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్ లో పనిచేస్తున్న విశ్వనాథ్  అనే కానిస్టేబుల్ కూడా కనిపించాడు. 

వారిని చూసి విశ్వనాథ్ అక్కడి నుండి పారిపోయాడు. ఇలాంటి  చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలలో పాల్గొన్న  స్పెషల్ బ్రాంచ్  విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎన్. విశ్వనాథ్  పి.సి.నెంబర్ 3150  క్రమశిక్షణ రాహిత్యంగా, పోలీస్ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ విశ్వనాథ్  ని సస్పెండ్ చేస్తూ రామగుండం పోలీసు కమిషనర్ వి. సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. 

రామగుండం కమిషనేరట్ పరిధిలో పనిచేసే అధికారులు ,సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యంగా, విధుల్లో  నిర్లక్ష్యంగా వ్యవహరించిన ,పోలీస్ వ్యవస్థ ప్రతిష్ట కి భంగం కలిగే విదంగా ఎవ్వరు ప్రవర్తించిన ఉపేక్షించేది లేదని శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

గంజాయి విక్రయిస్తూ...

జగిత్యాలలో  గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన ఇద్దరు యువకులను పట్టుకొని జగిత్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు 

పట్టణ సిఐ జయేష్ రెడ్డి తెలిపారు. జగిత్యాల పట్టణం తుకసినగర్ కు చెందిన రమేష్, హోసింగ్ బోర్డు కు చెందిన  తరుణ్ ను రేమండ్ కు పంపారు. అన్నపూర్ణ చౌరస్తా లో వాహనాలు సోదాలు చేస్తుండగా గంజాయితో  వారు దొరికినట్లు సిఐ తెలిపారు.

తమ్ముడు, అమ్మ మృతిని తట్టుకోలేక...

తమ్ముడు,అమ్మ మృతిని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. అమ్మ, తమ్మడు మృతికి తట్టుకోలేక  తమ్ముడి పుట్టినరోజే అక్క ఇంట్లో ఉరివేసుకొని తనువు చాలింది..
ఈ ఘటన జగిత్యాల గ్రామీణ మండలం తాటి పల్లి లో చోటు చేసుకొంది.

click me!