తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్నింటా ఉద్యమకారుల ప్రాధాన్యత పెరిగిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఈ విషయంలో చాలా సీరియస్ గా వున్నారని వెల్లడించారు.
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పదవుల పంపిణీలోనూ ఉద్యమ కారకులకే పెద్దపీట వేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఇదే పద్దతిని పాటించమని తమకు కూడా(ఎమ్మెల్యేలు,. మంత్రులు) సూచించినట్లు గంగుల తెలిపారు. గోపాల్ రావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ కార్యకర్తలను అధినాయకత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ప్రజల మదిలో చిరకాలం ఉంటుందన్నారు.
undefined
టీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతోంది...తామేదో బలపడుతున్నామని ఊహించుకుంటున్న ప్రతిపక్షాలకు హుజుర్ నగర్ ఉపఎన్నికల ఫలితమే చెంపపెట్టుగా గంగుల అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నిరుపేద ప్రజల ఆమోదంపొందిన పార్టీ అని అన్నారు. బడుగు బలహీనవర్గాలకు సేవచేసుకొనే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని మంత్రి అన్నారు.
read more హుజూర్‌నగర్ విజయం: బీజేపీది గాలివాటమే.. ఆ పార్టీ అసలు బలం ఇదేనన్న కేటీఆర్
గతంలో రైతులు విత్తనాలు వేసి ఆకాశం వైపు చూస్తుండేవారని...వారిని ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ చొరవ, ముందుచూపు కారణగంగా కాళేశ్వరం నీళ్లతో ఏడాదికి మూడు పంటలు పండుతున్నాయని ప్రశంసించారు.
తెలంగాణ రైతాంగానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతిగింజను కొంటామని ముఖ్యమంత్రి గతంలోనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని అడ్డుకోవాలని పాలకమండలికి సూచించారు.
ఐకేపీ సెంటర్లలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మార్కెట్ కు దశల వారిగా రైతులు పండించిన పంటను తరలించాలి... దీంతో రద్దీ తగ్గి రైతులకే కాదు మీకు కూడా సౌకర్యవంతంగా వుంటుందని మార్కెటింగ్ అధికారులకు మంత్రి సూచించారు.
read more tahsildar vijaya reddy: ఏ భూవివాదం లేదు.. నా బిడ్డ మంచోడు: నిందితుడు సురేశ్ తల్లి
రబీలో మరింత ధాన్యం దిగుబడి ఉంటుంది కాబట్టి ఈ .ధాన్యం కొనుగోలును ఓ ఛాలెంజ్ గా తీసుకుని పనిచేయాలన్నారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోకుండా తాము కేవలం అభివృద్ధిపై దృష్టి పెడుతున్నామని మంత్రి గంగుల తెలిపారు.