వేములవాడ ఆలయానికి వెళితే మంత్రి పదవి ఊడుతుందా...!: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Jan 18, 2020, 4:37 PM IST
Highlights

వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటే మంత్రి పదవులు వూడతాయని గతంలో  కొందరు  తప్పుడు ప్రచారాలు చేశారని... ఈ అపవాదును సీఎం కేసీఆర్ తుడిచివేశారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

వేములవాడ పట్టణ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వేములవాడలో మంత్రి టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలోనే వేములవాడ రాజరాజేశ్వర స్వామి అలయ అభివృద్ది గురించి కూడా కేటీఆర్ ప్రస్తావించారు. 

తెలంగాణలోని ప్రముఖ దేవస్థానాల్లో ఒకటయిన రాజన్న ఆలయాన్ని అభివృద్ది చేస్తానని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కేవలం ఆలయ అబివృద్ది కోసమే రూ.400 కోట్లతో పనులు చేపట్టేందుకు  ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎం ఆదేశాలతో అధికారులు అందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

ప్రజల ఆశీర్వాదంతో నాలుగు సార్లు రమేష్ బాబు ఇక్కడినుండి ఎమ్మెల్యేగా గెలిచారని... వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ అబివృద్ది కోసం కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే ప్రస్తుతం వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో పోటీచేస్తున్న 28 మంది టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని.... వారు కూడా ఎమ్మెల్యే మాదిరిగానే పట్టణ అభివృద్దికి కృషి చేస్తారని అన్నారు.

వీడియో  ఇక్కడే నేను రాజకీయాల్లో ఓనమాలు దిద్దాను : సత్యవతి రాథోడ్

కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వం హయాంలో రాజన్న ఆలయం ఎంతో వివక్షకు గురయిందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఈ గుడికి వస్తే మంత్రి పదవులు పోతాయని ప్రచారం చేశారని.... దీంతో రాజకీయ నాయకులెవ్వరు ఇక్కడికి రావడానికే భయపడేవారని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ ఆ అపవాదును తొలగించి ఏకంగా ముఖ్యమంత్రి హోదాలోనే  పలుమార్లు ఈ ఆలయాన్ని సందర్శించారని అన్నారు. 

పురపాలక  ఎన్నికల్లో విపక్షాలు గెలిచినా ఏం లాభం లేదన్నారు కేటీఆర్. ముళ్ల చెట్టుకు నీళ్లు పోసినా కాయలు కాయనట్లే అధికార పార్టీని కాదని ప్రతిపక్షాలకు ఓటేయడం వల్ల ప్రయోజనమేమీ వుండదన్నారు. కాబట్టి  ప్రజలు ఆలోచించి ఓటేయాలని కేటీఆర్ సూచించారు.

బీజేపీ నాయకులకు గొప్పలు ఎక్కువ పని తక్కువని విమర్శించారు. తెలంగాణ కి 19 వేళ కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ చెబితే కనీసం19 పైసలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. అలాంటిది తెలంగాణకు వేల కోట్లు కేంద్ర  ప్రభుత్వం అందించిందని ఆ పార్టీ  నాయకులు ప్రచారం చేసుకోవడం  విడ్డూరంగా వుందన్నారు. 

read more  దున్నపోతుకు గడ్డి వేస్తే బర్రె పాలు ఇస్తదా? సంగారెడ్డిలో హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

వేములవాడ ప్రాంతంలో  ఇప్పటికే రూ.218 కోట్లతో అబివృద్ది పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి ఇక్కడ పోటీ చేస్తున్న టీఆర్ఎస్  అభ్యర్థులందరిని గెలిపించాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. 

click me!