పార్టీ, జెండా లేకుండా ఎవ్వరూ లేరు... వారిది తాత్కాలిక విజయమే:మంత్రి ఈటల

By Arun Kumar PFirst Published Jan 1, 2020, 3:42 PM IST
Highlights

హుజూరాబాద్ మండలంలోని ఇందిరానగర్ దినేష్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో విద్యామంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.  

కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్, జమ్మికుంటలోని టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. మరికొద్దిరోజుల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలతో ఈటల చర్చించారు. అంతేకాకుండా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పలు సలహాలు, సూచనలిచ్చారు. ఈ కార్కక్రమంలో ఎన్నికల ఇంచార్జి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య కూడా పాల్గొన్నారు.

హుజూరాబాద్ మండలంలోని ఇందిరానగర్ దినేష్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీ, జెండా లేకుండా ఎవ్వరూ లేరన్నారు. ఈ సమావేశం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. 

స్థానిక మంత్రులు టికెట్ ఇచ్చి మద్దతుగా నిలిస్తేనే గెలుస్తామన్న స్థాయినుండి లోకల్ నాయకులే అభ్యర్థిని ఎంపికచేసే స్థాయికి రావాలని సూచించారు. తామే అభ్యర్ధిని గెలిపించుకుంటామని ధైర్యంగా చెప్పగలగాలని అన్నారు. 

ఎన్నికల్లో పోటీచేసే అవకాశ అందరికీ రాదు కేవలం కొద్ది మందికి మాత్రమే వస్తుందన్నారు. కాబట్టి టికెట్ ఎవ్వరికీ వచ్చిన అంతా కలిసి పనిచేయాలన్నారు. ఓట్లు లిక్కర్ కు, డబ్బులకు పడవని ప్రేమకు ,అభిమానానికి పడతాయన్నారు. ఎప్పుడు ఆత్మ గౌరవాన్ని అమ్ముకోవద్దని... ధర్మం తప్పవద్దన్నారు.

ప్రజలు చాలా గొప్పవాళ్ళని...ఎప్పుడూ మంచికి పట్టం కట్టడానికి సిద్దంగా వుంటారన్నారు. దయను కలిగివుండటం అనేది ప్రజలకు ఉన్న గొప్ప గుణమన్నారు. గెలవాలన్న గట్టి సంకల్పముంటే ఒక్క సీట్ కూడా బయటకు పోదన్నారు.  

read more  నమ్మక ద్రోహం చేసిన వారు బాగుపడరు: ఈటల మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్నికల్లో పోటీచేసే వారు  ముందుగా ప్రజల అభిప్రాయం తీసుకోవాలని... అనుకున్న దగ్గర రిజర్వేషన్ కుదరక పోతే వేరే దగ్గర పోటీ చేసి గెలవాలని సూచించారు.
తాను ఏదైనా మొహం మీద చెప్పలేనని... అలా చేస్తే బాధపడతారన్నారు. రిజర్వేషన్లు అధికారుల పరిధిలోన అంశమని... అందులో మంత్రుల జోక్యం ఉండదన్నారు. కాబట్టి ఈ విషయంలో తానేమీ చేయలేనని అన్నారు.

రిజర్వేషన్లపై ఎలాంటి అపోహలు వద్దని...అనవరంగా గుసగుసలు,పైరవీలు వద్దన్నారు. జనాభా రేషియోలో రిజర్వేషన్ లు వస్తాయన్నారు. డబ్బులుంటేనే టికెట్ వస్తుందని అనుకోవద్దని... గెలిచే సత్తా ఉన్నోల్లకే టికెట్లు కేటాయిస్తామన్నారు. 

100 శాతం నమ్మి మీ చేతిలో పని అప్పజెప్పానని... కీలక సమయంలో మీరు మోసం చేస్తే  మనసు గాయ పడ్తదన్నారు. అలాంటి విశ్వాసాన్ని,నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని అన్నారు. మసి బూసి మారేడు కాయ చేసే వాళ్ళు తాత్కాలిక విజయం సాధిస్తారని అన్నారు. 

తాను ఏ అధ్యక్షునికి అధికారం ఇవ్వనని....టికెట్ల కేటాయింపు విషయంలో 100 శాతం ప్రజల  అభిప్రాయాలను సేకరించి బస్వరజ్ సారయ్యతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. వందకువందశాతం ఒళ్ళు వంచి కమిట్మెంట్ తో పని చేసాము కాబట్టే మనం ఈ స్థాయిలో ఉన్నామన్నారు.

read more  నూతన సంవత్సరం వేళ... భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

గత ఎంపీ ఎలక్షన్స్ లో హుజూరాబాద్ నియోజకవర్గం లో గులాబీ జెండా గుబాలించిందని గుర్తుచేశారు.   ఎం.ఎల్. ఏ ఓట్లు,ఎం.పి.ఓట్లు చాలా తేలికని... ఎవరు గెలుస్తారనేది  ఈజీగా చెప్పొచ్చు  కానీ  వార్డ్ కి సంభందించిన ఎలక్షన్స్ చాలా కష్టమన్నారు. 

మున్సిపల్ అభ్యర్ధుల ఎంపిక కోసం కమిటీలు వేస్తామన్నారు. మంచొల్లకు టికెట్స్ వస్తాయన్నారు. మంచి వారితో తిరిగి అవగాహన తెచ్చుకోండని సూచించారు.  అన్ని వర్గాల వారికి సమానముగా టికెట్ల కేటాయిస్తామన్నారు.  ప్రజల అభిమానం ఉన్నొల్లు మాత్రమే విజయం సాధిస్తారని... వార్డ్ ప్రజలే వచ్చి మంచోనికి ఇచ్చారు అని చెప్పే స్థాయిలో ఉండాలని ఈటల సూచించారు. 

 

click me!