ఇక్కడ ఒక్కటే కేసు, పెరుగొద్దు: ఇంటింటికీ మంత్రి కేటీఆర్

By telugu teamFirst Published Apr 15, 2020, 5:22 PM IST
Highlights
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఆయన కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు. లాక్ డౌన్ కు సహకరించాలని ఆయన కోరారు.
సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఈ రోజు సిరిసిల్లలో పర్యటించారు. సిరిసిల్లలో ఇప్పటి వరకు ఒక్కటే కేసు నమోదైందని, అంతకు మించి పెరగవద్దని ఆయన అన్నారు. తెలంగాణలో కరోనా వైరస్ అదుపులో ఉందని ఆయన చెప్పారు. 

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నియంత్రణే మందు అని ఆయన చెప్పారు. వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన అన్నారు. ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని ఆయన సూచించారు. 

హద్దులు దాటితే పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. కరోనా వైరస్ నుంచి రాష్ట్రం  త్వరలో బయటపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించుకుందామని ఆయన అన్నారు. 

వేములవాడ సుభాష్ నగర్ రెడ్ జోన్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఇంటింటికీ తిరిగి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి నుంచి బయటకు రావద్దని ఆయన ప్రజలకు సూచించారు. 
click me!