అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరి పరిస్థితి విషమం

Arun Kumar P   | Asianet News
Published : Oct 02, 2020, 09:27 AM IST
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరి పరిస్థితి విషమం

సారాంశం

ఇన్నోవా కారు వేగంగా వెళుతూ వెనుకవైపు నుండి లారీని ఢీకొట్టింది. 

కరీంనగర్ జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు నుండి కరీంనగర్ వైపు రాజీవ్ రహదీరిపై వెళుతున్న కారు అతివేగంగా వెళుతూ అదుపుతప్పి లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరికి తీవ్ర గాయాలవగా మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  

వివరాల్లోకి వెళితే... జిల్లాలోని  తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ సమీపంలో ఓ లారీ రాజీవ్ రహదారి పక్కనే నిలిపివుంది. ఈ క్రమంలోని ఓ ఇన్నోవా వేగంగా వెళుతూ వెనుకవైపు నుండి లారీని ఢీకొట్టింది. కారు అతివేగం కారణంగా లారీ కిందకు చెచ్చుకెళ్లింది. దీంతో కారు ముందు సీట్లో కూర్చున్న వ్యక్తితో పాటు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న వారు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. రాత్రి సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి వుంది. 

 
 

PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు